ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 208

ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ ఆర్ఆర్ వర్క్ మొదలు

క్యారెక్టర్స్ ఆఫ్ గామి టీజర్ రిలీజ్

శివకార్తికేయన్-సాయిపల్లవి మూవీ టైటిల్ టీజర్ రిలీజ్

ఆదికేశవకు సెన్సేషనల్ టిఆర్పి

నైజాంలో హనుమాన్ టికెట్ రేట్ల తగ్గింపు

గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్

దేవర రిలీజ్ డేట్ మారింది

నరేష్ 61 ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ రిలీజ్

రాజేంద్ర ప్రసాద్ లవ్@65 ట్రైలర్ రిలీజ్

డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్ లో మార్పు

క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ లో NBK109

సినిమాల కోసం ఊహా ప్రపంచాలు
బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్.. ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టిన అల్లు అర్జున్
టాలీవుడ్ ప్రముఖ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు అరుదైన గౌరవం లభించింది. జర్మనీ వేదికగా జరిగే బెర్లిన్ ఇంటర్‌నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇండియా ప్రతినిధిగా అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఇక ఈ ఫెస్టివల్‌లో ఆయన నటించిన 'పుష్ప: ది రైజ్' సినిమా స్పెషల్ స్క్రీనింగ్ జరగడం విశేషం. కాగా ఇప్పటికే రష్యా, అమెరికా, గల్ఫ్, ఆస్ట్రేలియా మరియు యూకే తదితర దేశాల్లో విశేష ఆదరణ దక్కించుకున్న పుష్ప సినిమా.. ఇప్పుడు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా స్క్రీనింగ్ జరుపుకోవడం గమనార్హం.

ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ ఆర్ఆర్ వర్క్ మొదలు
శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

పుష్ప ఫ్రాంచైజ్ షురూ.. మూడో పార్టుపై హింట్ ఇచ్చిన అల్లు అర్జున్
టాలీవుడ్ హీరో, ఐకాస్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌లో సైతం సత్తా చాటిన ఈ మూవీ హిందీ బెల్ట్‌లో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. అయితే ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాను ఒక ఫ్రాంచైజ్ తరహాలో ప్లాన్ చేస్తున్నామని ప్రకటించారు హీరో అల్లు అర్జున్ . ఈ మేరకు ఆయన ఇటీవలే ఆయన బెర్లిన్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడం కోసం జర్మనీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్‌నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఇండియన్ ప్రతినిధిగా అల్లు అర్జున్ హాజరయ్యారు. అలాగే ఫెస్టివల్‌లో భాగంగా పుష్ప సినిమాను…

క్యారెక్టర్స్ ఆఫ్ గామి టీజర్ రిలీజ్
విధ్యాధర్ కాగిట దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గామి. డిఫరెంట్ కధతో ఈసినిమా వస్తుంది. మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించలేం. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న అఘోర శంకర్ హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈసినిమా కథ. ఈసినిమా మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గామి మేకింగ్ వీడియో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

ఓటీటీ లోకి వచ్చేసిన నా సామిరంగ
విజయ్ బిన్ని దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్ నాా సామిరంగ. అల్లరి నరేష్ ఇంకా రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. టైటిల్ కు తగ్గట్టే పర్ఫెక్ట్ గా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. చాలా కాలం తరువాత మాస్ రోల్ తో వచ్చిన నాగ్ మరోసారి తన సత్తా చూపించాడు. స్నేహం, ప్రేమ, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంది.

శివకార్తికేయన్-సాయిపల్లవి మూవీ టైటిల్ టీజర్ రిలీజ్
తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేస్తూనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. అందుకే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉంది. ఇక ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో రాజ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

ఆదికేశవకు సెన్సేషనల్ టిఆర్పి
ఉప్పెనతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ కొట్టాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్.ఇక ఈసినిమా తరువాత కొండపొలం,రంగ రంగ వైభవంగా చేశాడు.ఈరెండు వైష్ణవ్ కు విజయాన్ని అందించలేకపోయాయి.వీటి తరువాత నాలుగో సినిమాగా ఆదికేశవతో గత ఏడాది చివర్లో వచ్చాడు.కెరీర్ లో ఫస్ట్ ఫుల్ టైం ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ ను చేశాడు కానీ ఈసినిమా కూడా అనుకున్న విజయాన్ని ఇవ్వలేకపోయింది.

నైజాంలో హనుమాన్ టికెట్ రేట్ల తగ్గింపు
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది.సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. ఎన్నో పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా కానీ ఎంతో నమ్మకంతో రిలీజ్ అయింది. మేకర్స్ నమ్మకాన్ని నిజంచేస్తూ ఆడియన్స్ కూాడా ఈసినిమాకు బ్రహ్మరధం పట్టారు. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా రికార్డుల మోత మోగిస్తుంది. ఈసినిమా 300 కోట్ల క్లబ్ లోకి కూడా ఎప్పుడో చేరిపోయింది. ఒక్క హిందీలోనే 50 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుందంటేనే చెప్పొచ్చు ఈసినిమా క్రేజ్ ఎంత ఉందో. ఇంకా ఈ సినిమా పలు థియేటర్లలో రన్ అవుతూనే ఉంది.

గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ ఈనెల 18నుండి స్టార్ కానుంది. హైదరాబాద్ లో ఈషెడ్యూల్ జరుగనుందనట.ఇక సినిమా సెట్స్ మీద వెళ్లి రెండేళ్లు కావస్తున్న ఇంతవరకు షూటింగ్ పూర్తి కాలేదు.అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుండి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.ఇంతవరకు అధికారికంగా పోస్టర్లు తప్ప ఎలాంటి అప్డేట్ రాలేదు.ఓ సాంగ్ ను రిలీజ్ చేస్తామన్నారు అది కూడా వాయిదా వేశారు.అయితే సినిమా మాత్రం ఎదురుచూపులకు తగ్గట్లుగానే ఉండనుందట.ఇప్పటివరకు వచ్చిన అవుట్ ఫుట్ తో టీం సంతోషంగా ఉందట.

దేవర రిలీజ్ డేట్ మారింది
అనుకున్నట్లుగానే దేవర పార్ట్ 1 రిలీజ్ డేట్ మారింది.మొదట ఈసినిమాను ఏప్రిల్ 5న విడుదలచేయాలనుకున్నారు కానీ ఆటైంకు సినిమా రెడీ కాకపోనుండండంతో రిలీజ్ డేట్ ను మార్చుకున్నారు.దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలకానుందని పోస్టర్ ద్వారా మేకర్స్ తెలియజేశారు.ఇక ఈపోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది.ఫైట్ సీన్ లోని ఎన్టీఆర్ స్టిల్ ను విడుదలచేసి రిలీజ్ డేట్ చెప్పేశారు.

నరేష్ 61 ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ రిలీజ్
అల్లరి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు అల్లరి నరేష్. కామెడీ సినిమాతోనే కెరీర్ ను ప్రారంభించిన నరేష్ చాలా ఏళ్లు కామెడీ సినిమాలే చేసింది. అయితే ఈమధ్య తన రూట్ ను మార్చి కాస్త సీరియస్ మోడ్ లోకి వచ్చి సీరియస్ సినిమాలు చేశాడు. నాంది, ఇట్లు మారేడిమిల్లి ప్రజానీకం, ఉగ్రం ఇలా సీరియస్ సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. కానీ ఇప్పుడు మళ్లీ తన పాత ట్రాక్ లో వచ్చేస్తున్నాడు.

రాజేంద్ర ప్రసాద్ లవ్@65 ట్రైలర్ రిలీజ్
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ నట ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాలు ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశారు. అంతేకాదు ఈ వయసులో కూడా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, జయప్రధ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లవ్@65 అరవై ఏళ్ల ఓ జంట మళ్లీ ఎలా ప్రేమలో పడింది? అనే పాయింట్ ని ఓ సోషల్ మెసేజ్ మిక్స్ చేసి ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారు.

డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్ లో మార్పు
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ లో పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించి, తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు రామ్. పూరి జగన్నాథ్ స్టోరీ, రామ్ ఎనర్జీ, మణిశర్మ సంగీతం చిత్ర విజయానికి ప్లస్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా.

ఊరు పేరు భైరవకోన.. ప్రీమియర్స్‌పై కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కింది. సందీప్ కిషన్‌కి జోడీగా కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ నిర్మించగా.. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది.

ప్రీమియర్స్ టార్గెట్‌కి మించి వసూళ్లు - అనిల్ సుంకర
టాలీవుడ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం 'ఊరు పేరు భైరవకోన'. మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తుండగా.. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రదర్శించిన ప్రీమియర్స్‌కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.

క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ లో NBK109
నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ.. రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్ల ను అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది.

సినిమాల కోసం ఊహా ప్రపంచాలు
కొన్ని సినిమాలకు స్టార్టింగ్ లో ఇది కేవలం కల్పిత కథ మాత్రమే అని లేకపోతే ఇవి కేవలం కల్పిత పాత్రలే అంటూ వచ్చే గమనికను చూస్తూనే ఉంటాం. అంటే అవి నిజం కాదని అర్థం అన్నమాట. అయితే ఇప్పుడు కథలు, పాత్రలను దాటి మరో రేంజ్ కు వెళ్లిపోయారు మేకర్స్. సినిమాల కోసం ఇప్పుడు కొత్త ప్రపంచాలనే సృష్టిస్తున్నారు. ఆ కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లి కొత్త అనుభూతిని కలిగిస్తున్నారు. నిజంగానే ఆప్రదేశాలు ఉన్నాయోమే.. అక్కడ అలానేే ఉంటుందేమో.. అలాంటి నియమాలు ఉంటాయేమో అని సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ కు అనిపించక తప్పదు. బాహుబలి కోసం రాజమౌళి నిర్మించిన మాహిష్మతి రాజ్యం దగ్గర నుండి కె.జి.యఫ్ కోసం నారాచి రీసెంట్…

ప్రీమియర్ షో టికెట్ ఉంటే.. అక్కడ 20శాతం డిస్కౌంట్ - సందీప్ కిషన్
యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్‌లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పటికే ప్రదర్శించిన ప్రీమియర్స్‌కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.

టాలీవుడ్‌లో విషాదం.. సెంథిల్ కుమార్ భార్య కన్నుమూత
టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రూహీ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా కొన్ని అనారోగ్య సమస్యలతో ఆమె సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా కోవిడ్ 19 కారణంగా రూహీ కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సమస్యలు తీవ్రతరం కావడంతో.. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు.

సలార్ మరో ఓటీటీ లో హిందీ వెర్షన్
సలార్ తో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఖాన్సార్ అనే సామ్రాజ్యపు కుర్చీ కోసం జరిగే పోరు నేపథ్యంలో ఈసినిమా కథ. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈసినిమా దాదాపు 700 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టుకున్నట్టు తెలుస్తుంది.