గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ ఈనెల 18నుండి స్టార్ కానుంది. హైదరాబాద్ లో ఈషెడ్యూల్ జరుగనుందనట.ఇక సినిమా సెట్స్ మీద వెళ్లి రెండేళ్లు కావస్తున్న ఇంతవరకు షూటింగ్ పూర్తి కాలేదు.అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుండి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.ఇంతవరకు అధికారికంగా పోస్టర్లు తప్ప ఎలాంటి అప్డేట్ రాలేదు.ఓ సాంగ్ ను రిలీజ్ చేస్తామన్నారు అది కూడా వాయిదా వేశారు.అయితే సినిమా మాత్రం ఎదురుచూపులకు తగ్గట్లుగానే ఉండనుందట.ఇప్పటివరకు వచ్చిన అవుట్ ఫుట్ తో టీం సంతోషంగా ఉందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అన్ని కుదిరితే గేమ్ ఛేంజర్ ను సెప్టెంబర్ రెండో వారంలో విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.శ్రీకాంత్,శ్యామ్,అంజలి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.థమన్ సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నాడు.
ఇక రామ్ చరణ్ ఈసినిమాను పూర్తి చేసి తన 16వ సినిమాను మొదలుపెట్టనున్నాడు.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా మైత్రి మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్నాయి.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.సమ్మర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది.విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈసినిమాలో రామ్ చరణ్ డిఫ్రెంట్ లుక్ లో కనిపించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: