ప్రీమియర్ షో టికెట్ ఉంటే.. అక్కడ 20శాతం డిస్కౌంట్ – సందీప్ కిషన్

Sundeep Kishan Announces 20% Discount at Vivaha Bhojanambu Outlets with Ooru Peru Bhairavakona Premiere Ticket

యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్‌లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పటికే ప్రదర్శించిన ప్రీమియర్స్‌కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి16) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర బృందం బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ సక్సెస్ ప్రెస్ మీట్‌ని నిర్వహించింది. ఈ బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ సక్సెస్ ప్రెస్ మీట్‌లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “దాదాపు వంద ప్రీమియర్ షోలు పడ్డాయి. థియేటర్స్‌కి వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్‌కి థాంక్స్. పాటలు, ట్రైలర్‌కు మీరు ఇచ్చిన రెస్పాన్స్, మా మీద మీరు పెట్టుకున్న నమ్మకానికి చాలా రుణపడి వున్నాం. ముందుగా చెప్పినట్లే ప్రిమియర్ షో టికెట్ వున్న వారు ఆ టికెట్‌తో 20శాతం డిస్కౌంట్ ‘వివాహ భోజనంభు’లో రిడీమ్ చేసుకోవచ్చు. ఇది నా తరపున ప్రేక్షకులకు చిరు కానుక” అని తెలిపారు.

ఇంకా ఆయన ఇలా అన్నారు.. “ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నా పెర్ఫార్మెన్స్‌ని చాలా మెచ్చుకున్నారు. ఇది చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. మా టీం అందరికీ థాంక్స్. ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ యూనిమస్‌గా సినిమా హిట్, చాలా బావుందని అన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకూ చూడటానికి ఒక ఫాంటసీ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌ని తీశాం. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూసే సినిమా ఇది. ప్రేక్షకులందరి రెస్పాన్స్ కోసం ఎదురుచుస్తున్నాం” అని పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − seven =