ఉప్పెనతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ కొట్టాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్.ఇక ఈసినిమా తరువాత కొండపొలం,రంగ రంగ వైభవంగా చేశాడు.ఈరెండు వైష్ణవ్ కు విజయాన్ని అందించలేకపోయాయి.వీటి తరువాత నాలుగో సినిమాగా ఆదికేశవతో గత ఏడాది చివర్లో వచ్చాడు.కెరీర్ లో ఫస్ట్ ఫుల్ టైం ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ ను చేశాడు కానీ ఈసినిమా కూడా అనుకున్న విజయాన్ని ఇవ్వలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే థియేటర్లలో నిరాశపరిచిన ఈసినిమా టీవీల్లో అద్బుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది.రీసెంట్ గా ఆదికేశవను స్టార్ మా మొదటిసారి టెలికాస్ట్ చేయగా 10.47రేటింగ్స్ వచ్చింది.ఓ రకంగా చెప్పాలంటే మీడియం రేంజ్ హీరో కు ఈరేటింగ్స్ చాలా ఎక్కువ.ఆదికేశవను శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేయగా శ్రీ లీల హీరోయిన్ గా నటించింది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.నాగవంశీ,సాయి సౌజన్య నిర్మించారు.
ఇక ఈసినిమా తరువాత వైష్ణవ్ తేజ్ ఇంతవరకు మరో సినిమాకు ఓకే చెప్పలేదు.అయితే ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని పట్టుదలతో వున్నాడట వైష్ణవ్.అందుకే లేట్ అయినా పర్లేదు మంచి కంటెంట్ తో ప్రేక్షకులముందుకు రావాలని డిసైడ్ అయ్యాడట.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























