టాలీవుడ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తుండగా.. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రదర్శించిన ప్రీమియర్స్‌కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా చిత్ర బృందం గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇక ఈ ఈవెంట్లో నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. ” ‘ఊరు పేరు భైరవకోన’ ప్రీమియర్స్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ స్పందన ముందే ఊహించాం. సందీప్, ఆనంద్, రాజా.. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశారు. సెట్స్ అద్భుతంగా వున్నాయి. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర గొప్ప మ్యూజిక్ ఇచ్చారు. ప్రీమియర్స్ ఈ రేంజ్లో సక్సెస్ అవ్వడం, ప్రతి ఒక్కరూ సినిమా చాలా అద్భుతంగా వుందని చెప్పడం చాలా పాజిటివ్ సైన్. ప్రీమియర్స్ టార్గెట్ కోటి రూపాయిలకి పైగా హిట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. రేపు థియేటర్స్‌లో కూడా ప్రేక్షకుల రెస్పాన్స్ ఇదేమాదిరి అద్భుతంగా వుండబోతుంది” అని పేర్కొన్నారు.
అలాగే చిత్ర దర్శకుడు విఐ ఆనంద్ మాట్లాడుతూ.. “ఈ సినిమా ప్రీమియర్స్‌కు వచ్చిన ఆడియన్స్ అందరికీ థాంక్స్. అన్నీ షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. మూవీ చూసిన అందరూ అభినందించడం ఆనందాన్ని ఇచ్చింది. నేను చెప్పిన కథ చూసి మొహంలో ఎక్సయిట్ మెంట్ కోసం దర్శకుడినయ్యాను. ఆ ఎక్సయిట్మెంట్ని ప్రిమియర్స్ రోజు ప్రతి ఆడియన్ మొహంలో చూశాను. ఇది గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. శుక్రవారం సినిమా విడుదలౌతుంది. తప్పకుండా అందరూ చూడాలి” అని కోరారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























