ఊరు పేరు భైరవకోన.. ప్రీమియర్స్‌పై కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ కామెంట్స్

Ooru Peru Bhairavakona Press Meet Heroines Kavya Thapar and Varsha Bollamma Comments

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కింది. సందీప్ కిషన్‌కి జోడీగా కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ నిర్మించగా.. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా ప్రదర్శించిన ప్రీమియర్స్‌కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర బృందం గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈవెంట్‌లో భాగంగా సినిమాలో ఒక కథానాయికగా నటించిన కావ్యా థాపర్ మాట్లాడుతూ.. “ఊరు పేరు భైరవకోన చాలా స్పెషల్ మూవీ. ఇందులో నటించే అవకాశం కల్పించిన ఈ సినిమా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. షూటింగ్ సమయంలో మూవీ టీం అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇక హీరో సందీప్ కిషన్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, యాక్టర్. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది” అని అన్నారు.

మరో హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. “ఊరు పేరు భైరవకోన ప్రీమియర్స్ ఓ కామన్ ఆడియన్ లా చూశాను. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా యూనిట్ అందరికీ థాంక్స్. అందరూ సినిమాకి సపోర్ట్ చేయాలి’ అని కోరారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో ఊరు పేరు భైరవకోన చిత్రానికి పనిచేసిన యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =