అనుకున్నట్లుగానే దేవర పార్ట్ 1 రిలీజ్ డేట్ మారింది.మొదట ఈసినిమాను ఏప్రిల్ 5న విడుదలచేయాలనుకున్నారు కానీ ఆటైంకు సినిమా రెడీ కాకపోనుండండంతో రిలీజ్ డేట్ ను మార్చుకున్నారు.దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలకానుందని పోస్టర్ ద్వారా మేకర్స్ తెలియజేశారు.ఇక ఈపోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది.ఫైట్ సీన్ లోని ఎన్టీఆర్ స్టిల్ ను విడుదలచేసి రిలీజ్ డేట్ చెప్పేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The Lord of Fear is unleashing his tsunami of electrifying action on 10.10.24 🌊#Devara@tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN @RathnaveluDop @sabucyril @sreekar_prasad @anirudhofficial @Yugandhart_ @NTRArtsOfficial @DevaraMovie @Tseries… pic.twitter.com/zzPVglmE1g
— Yuvasudha Arts (@YuvasudhaArts) February 16, 2024
ఇక ఏప్రిల్ 5న రిలీజ్ చేసి వరస సెలవులను క్యాష్ చేసుకుందామనుకుంది దేవర టీం అయితే షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల ఇప్పుడు రిలీజ్ తేదీని మార్చాల్సివచ్చింది.కానీ వెనక్కి వెళితే వెళ్లారు కానీ ఈసారి కూడా మంచి డేట్ నే లాక్ చేసుకున్నారు.దసరా సెలవులను దేవర వాడుకోనుంది.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది.అవుట్ అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు.యువసుధ ఆర్ట్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈసినిమాను పూర్తి చేసి ఎన్టీఆర్,వార్ 2లో జాయిన్ కానున్నాడు. ఈసినిమాతో ఎన్టీఆర్ మొదటి సారి స్ట్రయిట్ హిందీ మూవీలో నటించనున్నాడు.అయాన్ ముఖర్జీ ఈసినిమాను తెరకెక్కించనుండగా హృతిక్ రోషన్ మరో హీరోగా నటించనున్నాడు.భారీ బడ్జెట్ తో యాష్ రాజ్ ఫిలిమ్స్ ఈసినిమాను నిర్మించనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: