శివకార్తికేయన్-సాయిపల్లవి మూవీ టైటిల్ టీజర్ రిలీజ్

sivakarthikeyan and sai pallavi movie title teaser out now

తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేస్తూనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. అందుకే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉంది. ఇక ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో రాజ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు కార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి అప్ డేట్ వచ్చేసింది. తాజాగా ఈసినిమా టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు అమరన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక టీజర్ ను బట్టి కశ్మీర్, టెర్రరిస్ట్, ఇండియన్ ఆర్మీ కథాంశం నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు స్పష్టం అవుతుంది.

కాగా ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ మరియు సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా కలిసి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్‌గా సిహెచ్ సాయి పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − thirteen =