నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ నట ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాలు ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశారు. అంతేకాదు ఈ వయసులో కూడా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, జయప్రధ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లవ్@65 అరవై ఏళ్ల ఓ జంట మళ్లీ ఎలా ప్రేమలో పడింది? అనే పాయింట్ ని ఓ సోషల్ మెసేజ్ మిక్స్ చేసి ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఫస్ట్ లుక్ ను నిన్ననే రిలీజ్ చేశారు. ఇక ఈరోజు ట్రైలర్ తో వచ్చారు. తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. ఆద్యంతం కామెడీ ఎలిమెంట్స్ తో ట్రైలర్ మెప్పిస్తుంది. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. మరి సినిమా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈ సినిమాలో కార్తీక్ రాజు, సునీల్, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























