విజయ్ బిన్ని దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్ నాా సామిరంగ. అల్లరి నరేష్ ఇంకా రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. టైటిల్ కు తగ్గట్టే పర్ఫెక్ట్ గా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. చాలా కాలం తరువాత మాస్ రోల్ తో వచ్చిన నాగ్ మరోసారి తన సత్తా చూపించాడు. స్నేహం, ప్రేమ, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా ఈమధ్యనే ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే కదా. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మరి థియేటర్లలో చూడనివారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.
The MASS JATHARA has arrived into everyones home now!🤩
Enjoy watching Sankranthi Action Entertainer #NaaSaamiRanga exclusively on @DisneyPlusHS!! 🥳🔥▶️ https://t.co/8pH9exvoG2#NaaSaamiRangaonHotstar @iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun… pic.twitter.com/SX4ygIqdyL
— Telugu FilmNagar (@telugufilmnagar) February 17, 2024
కాగా ఈసినిమాలో అషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లన్ హీరోయిన్లుగా నటించగా షబీర్ కల్లరక్కల్, రవివర్మ, నాజర్, రావు రమేష్, మధుసూదన్ రావు తదితరులు నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈసినిమాను నిర్మించారు ఎం.ఎం కీరవాణి ఈసినిమాకు సంగీతం, దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: