విధ్యాధర్ కాగిట దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గామి. డిఫరెంట్ కధతో ఈసినిమా వస్తుంది. మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించలేం. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న అఘోర శంకర్ హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈసినిమా కథ. ఈసినిమా మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్తో పాటు గామి మేకింగ్ వీడియో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ మరో అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమా నుండి క్యారెక్టర్స్ ఆఫ్ గామి పేరుతో టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇదే నీ సమస్యకు పరిష్కారం అంటూ ఓ మ్యాప్ చూపిస్తూ టీజర్ మొదలవుతుంది. టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఈటీజర్ లో ఈసినిమాలో నటిస్తున్న పాత్రలను రివీల్ చేశారు మేకర్స్.
Introducing the characters from the world of #Gaami ❤️🔥
– https://t.co/9u7O9Duee7Theatrical trailer on February 29th 💥
Grand release worldwide on March 8th 🧿@VishwakSenActor @ChandiniC @mgabhinaya @KarthikSabaresh @nanivid #NareshKumaran @_Vishwanath9 @Synccinema… pic.twitter.com/CXBxfMNF19
— UV Creations (@UV_Creations) February 17, 2024
కాగా ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: