
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 209


సుందరం మాస్టర్ ట్రైలర్ రిలీజ్

టిల్లు స్క్వేర్ ట్రైలర్ రెస్పాన్స్

అల్లరి నరేష్ 61 నుండి క్రేజీ అప్ డేట్
జర్మనీకి పయనమైన అల్లు అర్జున్.. ఎందుకంటే?

ఓయ్ రీ రిలీజ్ కు షాకింగ్ రెస్పాన్స్

మురగదాస్-శివకార్తికేయన్ మూవీ ప్రారంభం

అడివి శేష్ G2లో బాలీవుడ్ స్టార్

భైరవకోన ప్రీమియర్స్ టాక్

విజయ్ గోట్.. ఏప్రిల్ కు కంప్లీట్ చేసే ప్లాన్?

వాలెంటైన్స్ డే సందర్భంగా.. ఉపాసన స్పెషల్ పోస్ట్

టిల్లు స్క్వేర్ ట్రైలర్ రిలీజ్

రామం రాఘవం ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

విశ్వంభరకు చిన్న బ్రేక్ అంటున్న చిరు

వరల్డ్ వైల్డ్ గా RC16
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను శంకర్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు రాగా మరికొద్దిరోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

రివ్యూ : ఊరు పేరు భైరవకోన
ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య వచ్చిన ఊరు పేరు భైరవకోన ఆకట్టుకుందని చెప్పొచ్చు.ఫస్ట్ హాఫ్ సూపర్ అనేలా ఉండగా సెకండ్ హాఫ్ డీసెంట్ అనిపించుకుంది.సందీప్ నటన,కామెడీ ,సాంగ్స్ సినిమాలో హైలెట్ అయ్యాయి.ఓమంచి ఫాంటసీ థ్రిల్లర్ ను చూడాలనుకుంటే ఈ భైరవకోనను చూడొచ్చు.

సుందరం మాస్టర్ ట్రైలర్ రిలీజ్
కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో హర్షచెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా సుందరం మాస్టర్. ఓ గిరిజిన ప్రాంతానికి ఇంగ్లీష్ టీచర్ గా వెళ్లిన సుందరం అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అన్నదే ఈసినిమా కథ. ఈ సినిమా ఫిబ్రవరి 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే కామెడీ ఎలిమెంట్స్ తో ఆద్యంతం…

రాజేంద్ర ప్రసాద్ లేటు ప్రేమాయణం లవ్@65
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాప్ నిర్మాణ సంస్థల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఒకటి. తక్కువ కాలంలోనే మంచి మంచి కాంబినేషన్స్ తో సినిమాలు చేసి తమ ఉనికిని గట్టిగా చాటుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా వైవిధ్యమైన కథా చిత్రాలను నిర్మిస్తూ…విజయాలు సాధిస్తూ..అటు ఆడియన్స్ లోను, ఇటు ఇండస్ట్రీలోను అనతి కాలంలోనే ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. ఇక ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు తీస్తూనే మరోపక్క ఢిపరెంట్ సినిమాలను కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. అలా వస్తున్న సినిమానే లవ్@65.

టిల్లు స్క్వేర్ ట్రైలర్ రెస్పాన్స్
సీక్వెల్స్ కు ఎప్పుడైనా క్రేజ్ ఎక్కువగా ఉంటుంది.ఫస్ట్ పార్ట్ హిట్ అయితే సీక్వెల్ ఫై అంచనాలు పెరిగిపోతాయి.ఇప్పుడు టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ అయ్యింది.ఇదే ట్యాగ్ తో వస్తుంది టిల్లు స్క్వేర్.రెండేళ్ల క్రితం వచ్చిన డీజే టిల్లు చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బాస్టర్ అయ్యింది.స్టోరీ పక్కన పెడితే హీరోగా చేసిన సిద్దు జొన్నలగడ్డ యాక్టింగ్ యూత్ ను ఫిదా చేసింది.

అల్లరి నరేష్ 61 నుండి క్రేజీ అప్ డేట్
అల్లరి నరేష్ కూడా ఈమధ్య డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే కదా. నాంది సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ కు నాంది పలికాడు. నాంది సినిమాలో తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఆ తరువాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలు వచ్చాయి. ఈరెండు సినిమాలు కూడా మిశ్రమ స్పందనను దక్కించుకున్నాయి. రీసెంట్ గా నా సామిరంగ సినిమాలో ఒక కీలక పాత్రలో కూడా నటించాడు. ఇక ఇప్పుడు పలు సినిమాలను లైన్ లో పెట్టాడు.
జర్మనీకి పయనమైన అల్లు అర్జున్.. ఎందుకంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'పుష్ప 2'లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఈ సినిమా చిత్రీకరణకు స్వల్ప విరామం ప్రకటించి జర్మనీకి పయనమయ్యారు. ఈ మేరకు గురువారం ఉదయం అల్లు అర్జున్ హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెర్లిన్ వెళుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన ఇంత అకస్మాత్తుగా జర్మనీకి పయనం కావడంపై అభిమానుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ జర్మనీకి బయలుదేరడానికి ముఖ్య కారణం ఏంటో తెలిసింది.

హృతిక్ రోషన్‌కి గాయం.. త్వరగా కోలుకోవాలని కోరుతున్న ఫ్యాన్స్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కి గాయమైంది. ఈ మేరకు విషయాన్ని ఆయనే తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేయడం ద్వారా వెల్లడించారు. అందులో తన నడుముకు బెల్ట్ పెట్టుకుని కనిపించిన హృతిక్.. క్రచెస్ సపోర్టుతో నిలబడి ఉన్నారు. దీనిని చూస్తుంటే హృతిక్ రోషన్ కాళ్లు, బ్యాక్ బోన్‌కి బలమైన గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇక హృతిక్ గాయపడటం గురించి తెలిసిన పలువురు సినీ ప్రముఖులు టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్, వాణీ కపూర్ తదితులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే దీనిపై స్పందించిన హృతిక్ ఫ్యాన్స్ మరియు కొందరు నెటిజన్లు ఆయనకు తమ మద్దతు తెలియజేశారు.

ఓయ్ రీ రిలీజ్ కు షాకింగ్ రెస్పాన్స్
గత ఏడాది నుండి టాలీవుడ్ లో రీ రిలీజ్ హడావుడి పెరిగిపోయింది.మొదట హీరోల బర్త్ డే లకు ఎక్కువ ఈ హడావిడి ఉండేది ఆ తరువాత కామన్ అయిపొయింది.కొత్త సినిమాల రిలీజ్ లేనప్పుడు రీ రిలీజ్ ముందుకు వస్తున్నాయి అయితే రీసెంట్ గా ఇది కొంచెం తగ్గింది కానీ నిన్న ప్రేమికుల దినోత్సవం కావడంతో రీ రిలీజ్ లు క్యూ కట్టాయి.ఒకటి కాదు రెండు కాదు నిన్న ఏకాంగా 5సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి ఇందులో అన్ని కల్ట్ సినిమాలుగా పేరు తెచ్చుకున్నవే.

మురగదాస్-శివకార్తికేయన్ మూవీ ప్రారంభం
తమిళ్ టాలెంటెడ్ నటుల్లో శివకార్తికేయన్ కూడా ఒకరు. తన టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎదిగి ఇప్పుడు స్టార్ హీరోగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే అయలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శివకార్తికేయన్. ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ నే అందుకుంది. ప్రస్తుత పలు సినిమాలు లైన్ లో ఉండగా.. అందులో మురగదాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది.

అడివి శేష్ G2లో బాలీవుడ్ స్టార్
టాలీవుడ్ యంగ్ హీరోలలో అడివి శేష్ శైలి వేరు. తనకు నచ్చిన పాత్ర కోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురుచూడటం ఆయన నైజం. అలాగే నటించడంతో పాటు కథా రచనలోనూ అడివి శేష్ తన మార్క్ చూపుతాడు. సినిమా, సినిమాకి ఎక్కువ గ్యాప్ తీసుకున్నా.. ఆయన మూవీ విడుదలవుతుందంటే హిట్ పక్కా అని ప్రేక్షకులు భావిస్తారంటే తన సినిమాల విషయంలో ఆయన ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. అడివి శేష్ ఇంతకుముందు 'క్షణం', 'గూఢచారి', 'ఎవరు', 'మేజర్' చిత్రాల ద్వారా అద్భుతమైన హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే.

త్వరలోనే సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. జట్ల వివరాలు, పూర్తి షెడ్యూల్ ఇదే..!
భారతీయ చిత్ర పరిశ్రమలలోని హీరోలు బాక్సాఫీస్ బరిలోనే కాకుండా క్రికెట్ గ్రౌండ్ లోనూ తలపెడుతుంటే చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు అభిమానులకు. సినీ ప్రియులు మరియు క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ తరుణం రానే వచ్చింది. త్వరలోనే వీరందరూ తమ చిత్ర పరిశ్రమల తరపున బరిలోకి దిగి హోరాహోరీగా పోరాడనున్నారు. ఈ సంరంభానికి సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) వేదిక కానుంది. కాగా ఈ ఏడాది సీసీఎల్ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, పంజాబీ, భోజ్‍పురి, బెంగాలీ తదితర భాషల సినీ ఇండస్ట్రీల నటులు ఈ టోర్నీలో తలపడటానికి సిద్ధమయ్యారు.

యానిమల్- గ్లోబల్ ఛార్ట్ లో అదే హవా
సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన వయోలెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ మూవీ. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమాా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఈసినిమాలో మరోసారి తన సత్తా చూపించాడు సందీప్ వంగా. ఈసినిమాను సందీప్ తీసిన విధానం అలానే ఇక ఈ రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

ఓటీటీలోకి వచ్చేసిన డంకీ
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన సినిమా డంకీ. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డంకీ పద్దతి ద్వారా అక్రమ వలసలు వెళ్లే వారి నేపథ్యం తీసుకొని ఈసినిమాను తెరకెక్కించారు. ఈసినిమా మిశ్రమ ఫలితాన్ని అందించింది.

భైరవకోన ప్రీమియర్స్ టాక్
ఎప్పటినుండో ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్.అందుకే ఈసారి డిఫ్రెంట్ సబ్జెక్టు తో సినిమా చేశాడు అదే ఊరు పేరు భైరవకోన.రెండు పాటలు సూపర్ డూపర్ హిట్ అవ్వడం ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో ఈసినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.మేకర్స్ అయితే ఓ అడుగు ముందుకేసి కంటెంట్ మీద వున్న నమ్మకంతో రెండు రోజుల ముందే అంటే నిన్ననే పెయిడ్ ప్రీమియర్లు కూడా వేశారు.వీటికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

విజయ్ గోట్.. ఏప్రిల్ కు కంప్లీట్ చేసే ప్లాన్?
దళపతి విజయ్ తన తరువాత సినిమా వెంకట్ ప్రభుతో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. న్యూ ఇయర్ సందర్భంగా ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

వాలెంటైన్స్ డే సందర్భంగా.. ఉపాసన స్పెషల్ పోస్ట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల బుధవారం (ఫిబ్రవరి 14, 2024) ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒక మధురమైన పోస్ట్‌ను తన అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్‌ను పెట్టారు. అందులో ఉపాసన, రామ్ చరణ్ మరియు కుమార్తె క్లిన్ కారా చేతులు ఉన్న ఒక స్నాప్‌ను షేర్ చేశారు. దీనికి రెడ్ హార్ట్ ఎమోటికాన్‌ను జోడించిన ఉపాసన, క్యాప్షన్‌లో ఇన్ఫినిటీ సింబల్‌ను పోస్ట్ చేశారు. వాలెంటైన్స్ డే వేళ ఉపాసన పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాగా రామ్ చరణ్, ఉపాసనలది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. ఇక ఈ దంపతులు గతేడాది తమ కుమార్తె క్లిన్ కారాకు…

టిల్లు స్క్వేర్ ట్రైలర్ రిలీజ్
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది డీజే టిల్లు సినిమా. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ఈసినిమాలోని డైలాగ్స్, సాంగ్స్, టిల్లు యాటిట్యూడ్ అన్నీ సినిమాకు హైలెట్ నిలిచి సంచలన విజయం అందించాయి. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వస్తుంది. ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా సిద్దూ నటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్, పలు పాటలను రిలీజ్ చేయగా అవి కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

రామం రాఘవం ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
కమెడియన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ధనరాజ్ సినిమాల్లో కంటే జబర్దస్త్ కామెడీ షో ద్వారానే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఆ తరువాతా హీరోగా మారి పలు సినిమాలు కూడా చేశాడు. నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక ఇప్పుడు తానే దర్శకుడిగా మారి మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో రామం రాఘవం అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమాలో డైరెక్టర్ కమ్ టాలెంటెడ్ నటుడు అయిన సముద్రఖని కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. డిఫరెంట్ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా అంచనాలు బాగానే పెరిగాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటికే పలు పోస్టర్లను కూడా…

విశ్వంభరకు చిన్న బ్రేక్ అంటున్న చిరు
మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయగా ఆవీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఈసినిమా షూటింగ్ ను రీసెంట్ గానే మొదలుపెట్టిన సంగతి కూడా విదితమే.