సలార్ మరో ఓటీటీ లో హిందీ వెర్షన్

prabhas salaar movie hindi version streaming update

సలార్ తో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఖాన్సార్ అనే సామ్రాజ్యపు కుర్చీ కోసం జరిగే పోరు నేపథ్యంలో ఈసినిమా కథ. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈసినిమా దాదాపు 700 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టుకున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈసినిమా అందుబాటులో ఉంది. కానీ ఈసినిమా హిందీ వెర్షన్ మాత్రం ఇంతవరకూ అందుబాటులోకి రాని సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా హిందీ వెర్షన్ కు సంబంధించిన అప్ డేట్ కూడా వచ్చేసింది. సలార్ సినిమా హిందీ వెర్షన్ మరో ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో కాకుండా మరో ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

కాగా సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. పృథ్విరాజ్ సుకుమారన్‌, జగపతిబాబు, బాబి సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్‌, సప్తగిరి, సిమ్రత్‌ కౌర్‌, పృథ్విరాజ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. . హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించగా.. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − seventeen =