నరేష్ 61 ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ రిలీజ్

allari naresh 61 movie first look and title glimpse out now

అల్లరి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు అల్లరి నరేష్. కామెడీ సినిమాతోనే కెరీర్ ను ప్రారంభించిన నరేష్ చాలా ఏళ్లు కామెడీ సినిమాలే చేసింది. అయితే ఈమధ్య తన రూట్ ను మార్చి కాస్త సీరియస్ మోడ్ లోకి వచ్చి సీరియస్ సినిమాలు చేశాడు. నాంది, ఇట్లు మారేడిమిల్లి ప్రజానీకం, ఉగ్రం ఇలా సీరియస్ సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. కానీ ఇప్పుడు మళ్లీ తన పాత ట్రాక్ లో వచ్చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా ఎప్పుడో మొదలుపెట్టారు కూడా. ప్రస్తుతానికి నరేష్ 61 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలానే టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా టైటిల్ గ్లింప్స్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాకు ఆ ఒక్కటీ అడక్కు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకుంటుంది. గ్లింప్స్ ను బట్టి ఈసినిమా అల్లరి నరేష్ పెళ్లి నేపథ్యంలో ఉంటుందని అర్థమవుతుంది. ఇంట్లో నుండి బయటకు వచ్చిన అల్లరి నరేష్ ను ఒక్కొక్కరూ ఒక్కో భాషలో పెళ్లి ఎప్పుడు అని అడుగుతుంటారు. దానికి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు అంటూ చెబుతాడు. గ్లింప్స్ అయితే ఆకట్టుకుంటుంది. అంతేకాదు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేశారు. మార్చి 22వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనన్నారు.

కాగా ఈసినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుండగా హర్ష చెముడు, అరియానా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను చిలక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ చిలక నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − five =