కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 207

Tamil Filmmaker Shankar's Daughter Aishwarya Engaged with Assistant Director Tharun Karthikeyan
సినిమా వార్తలు

స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య ఎంగేజ్‌మెంట్, ఫోటోలు వైరల్

కోలీవుడ్ స్టార్ శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలాఉంటే త్వరలోనే ఆయన ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్యా శంకర్ వివాహం మరికొన్ని రోజుల్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఐశ్వర్య నిశ్చితార్థం తరుణ్ కార్తికేయతో ఘనంగా జరిగింది. ఆదివారం (ఫిబ్రవరి 18, 2024) చెన్నైలో జరిగిన ఈ వేడుకలో ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు శంకర్ సన్నిహితుల మిత్రులు కొంతమంది హాజరయ్యారు.

Srikanth Mవాట్సాప్
dhanush 50th movie first look out now
ఫస్ట్ లుక్

ధనుష్ 50 మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్

తమిళ్ టాలెంటెడ్ హీరో ధనుష్ మాత్రం ఎక్కడా తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తూ తన సత్తా చూపిస్తున్నాడు. ఇప్పటికే తెలుగులో సార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ధనుష్. ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని…

TFN Adminవాట్సాప్
sithara entertainments acquired bramayugam movie telugu version rights
సినిమా వార్తలు

సితార చేతికి మమ్ముట్టి భ్రమయుగం తెలుగు రైట్స్

మలయాళం సీనియర్ హీరో మమ్ముట్టి ఈ వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అది కూడా ఏ సినిమా పడితే ఆసినిమా కాదు. కథా ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ హిట్లు కూడా అందుకుంటున్నాాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా మరేదో కాదు భ్రమయుగం. ఈసినిమా అప్ డేట్లతోనే సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్. హార్రర్ థిల్లర్ నేపథ్యంలో పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ తో ఈసినిమా ను తెరకెక్కించారు. ఈసినిమా ఈనెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో రిలీజ్ అయిన ఈసినిమా అక్కడ హిట్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Rana Daggubati First Movie Leader Completed 14 Years
సినిమా వార్తలు

నటుడిగా 14 ఏళ్ళు పూర్తి చేసుకున్న రానా

'బాహుబలి'లో భల్లాలదేవుడిగా ప్రతినాయక పాత్రలో కౄరత్వం ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి నటుడిగా 14 వసంతాలు పూర్తిచేసుకున్నారు. కాగా రానా, ఇండియన్ మూవీ మొఘల్, దివంగత దిగ్గజ నిర్మాత రామానాయుడు మనవడు అన్న విషయం తెలిసిందే. రామానాయుడు పెద్ద కుమారుడు, స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు తనయుడైన రానా.. బాబాయి విక్టరీ వెంకటేష్ నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఆయన నటించిన మొదటి సినిమా 'లీడర్' నేటితో 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
anupama parameswaran thanks to audience
సినిమా వార్తలు

మీ లవ్, సపోర్ట్ కు థ్యాంక్స్

కెరీర్ ప్రారంభంలోనే పలు హిట్లను తన ఖాతాలో వేసుకుంది టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. తన ఉంగరాల జుట్టుతో, అభినయంతో ఎంతో మంది యువతకు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే మధ్యలో కాస్త ఫ్లాప్స్ తో కెరీర్ డల్ అయినా ఇప్పుడు మాత్రం వరుసగా సినిమాలను చేస్తూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉండగా త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Felicitated by NRI's in Los Angeles, USA
సినిమా వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవికి అమెరికాలో ఘన సన్మానం

మెగాస్టార్ చిరంజీవికి అమెరికాలో ఘనంగా సన్మానం జరిగింది. అక్కడి ఎన్నారైలు మరియు మెగాస్టార్ అభిమానుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ దంపతులు పాల్గొనగా వారిని అభిమానులు పుష్పగుచ్చాలు అందించి శాలువాతో సత్కరించారు. కాగా మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన విష‌యం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ క్రమంలో త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు.

Srikanth Mవాట్సాప్
Operation Valentine Movie Trailer Update
ట్రైలర్ & టీజర్

ఆపరేషన్ వాలెంటైన్ కోసం చరణ్, సల్మాన్

శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు. మార్చి 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Actress Sreeleela Visits Tirumala Temple Today
సినిమా వార్తలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలీల

టాలీవుడ్ ప్రముఖ నటి శ్రీలీల గతేడాది స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన 'భగవంత్ కేసరి', అంతకుముందు రవితేజ 'ధమాకా' చిత్రాలతో సాలిడ్ హిట్స్ అందుకున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన 'గుంటూరు కారం' సినిమాతో ఆమె మరోసారి ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.250 కోట్లు వసూళ్లు సాధించింది. ఇక గత కొంతకాలంగా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న శ్రీలీల తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Ravi Teja's Eagle Collects Over 51.4 Cr Gross by the End of 2nd Weekend
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ఈగల్.. 2 వీక్స్ కలెక్షన్స్ ఎంతంటే?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వర హీరోయిన్లుగా నటించగా.. హీరో నవదీప్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల పేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుంది.

Srikanth Mవాట్సాప్
Ooru Peru Bhairavakona movie 3 days collections
బాక్సాఫీస్

ఊరు పేరు భైరవ కోన 3 డేస్ సాలిడ్ కలెక్షన్స్

ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఈసినిమా ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ టాక్ తో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈసినిమా కథ, మేకింగ్, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Brother's Daughter Dance For Kurchi Madathapetti Song Goes Viral
సాంగ్

కుర్చీ మ‌డ‌తపెట్టి సాంగ్‌.. మ‌హేశ్‌బాబు అన్న కూతురు డ్యాన్స్‌ చూశారా?

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు ఇటీవలే 'గుంటూరు కారం' చిత్రంతో సక్సెస్ అందుకున్నారు. ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన ఈ మూవీ దాదాపు 250 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో మహేష్ నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ.. ఇలా ప్రతి ఒక్కటి అభిమానులకు పండుగ సంబరాన్ని డబుల్ చేసింది. ఇక ఈ సినిమాలోని 'కుర్చీ మ‌డ‌తపెట్టి' సాంగ్‌ అయితే నెట్టింట విపరీతంగా ట్రెండింగ్ అయింది. ఈ పాటలో హీరో మహేష్ బాబుతోపాటు హీరోయిన్ శ్రీలీల డ్యాన్స్‌తో అదరగొట్టారు. ముఖ్యంగా శ్రీలీల అయితే అన్ మ్యాచబుల్ అన్నట్లుగా డ్యాన్స్ చేసి ప్రేక్షకులను థ్రిల్ చేసింది. కాగా ఈ పాటకు దేశవిదేశాల్లోని అనేకమంది రీల్స్ చేయడం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
janhvi kapoor movie with ram charan is confirmed
సినిమా వార్తలు

రామ్ చరణ్ తో జాన్వీ కపూర్ కన్ఫామ్

ఒకనాటి అందాలతార శ్రీదేవి తెలుగు చిత్ర పరిశ్రమలో తన సినిమాలతో ఎన్నో ఏళ్లు ఏలారు. కేవలం తెలుగు మాత్రమే కాదు తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు చేశారు. ఇక శ్రీదేవి చనిపోయిన తరువాత ఇప్పుడు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆ కోరిక కూడా తీరిపోనుంది. ఇప్పటికే జాన్వీ కపూర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకోనుండగా ఈఏడాది దసరా పండుగ కానుకగా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
special treat from Saripodhaa Sanivaaram movie
సినిమా వార్తలు

సరిపోదా శనివారం నుండి వచ్చే శనివారం స్పెషల్ ట్రీట్

గత ఏడాది రెండు సినిమాలతో అలరించిన నాని ప్రస్తుతం కొత్త సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. ఈసినిమాలో నాని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

TFN Adminవాట్సాప్
Nithiin's Robinhood Movie Completes Munnar Schedule
షూటింగ్ అప్‌డేట్

నితిన్ 'రాబిన్‌హుడ్' షెడ్యూల్ అప్‌డేట్

టాలీవుడ్ హీరో నితిన్ ఇటీవలే 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం 'రాబిన్‌హుడ్‌'. ట్యాలెంటెడ్ మేకర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి 'భీష్మ' అనే సినిమా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సక్సెస్ ఫుల్ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. ఈ క్రమంలో ఈసారి యూనిక్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్‌తో రాబోతోంది. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. నితిన్ సరికొత్త పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో ట్రెండీ లుక్‌లో అలరించనున్నారు.

Srikanth Mవాట్సాప్
hero yash makes fans crazy with his simplicity
సినిమా వార్తలు

సింప్లిసిటీతో ఫిదా చేస్తున్న కె.జి.యఫ్ స్టార్

ఎంత స్టార్ డమ్ వచ్చినా కూడా కొంతమంది సెలబ్రిటీలు ఎంతో సింప్లిసిటీ ని మెయిన్ టైన్ చేస్తుంటారు. ఇక ఇక్కడ ఓ స్టార్ హీరో కూడా తన సింప్లిసిటీతో ఫిదా చేస్తున్నాడు. ఆ హీరో ఎవరో కాదు కె.జి.యఫ్ తో దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న యష్. రోడ్డు పక్కన ఉన్న ఓ షాప్‌ దగ్గర ఆగి తన కూతురికి ఏదో కొనిస్తున్నాడు. ప్రస్తుతం ఈఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫొటోలో భార్య రాధిక దుకాణం ముందు ఉన్న బెంచీపై కూర్చొని భర్త వైపు చూస్తూ ఈ ఫొటోలో కనిపించింది. కాగా ఇటీవలే తన భార్య, ప్రముఖ నటి రాధిక పండిట్, కూతురు ఐరాతో కలిసి కర్ణాటకలోని భత్కల్ జిల్లా షిరాలీలో ఉన్న ప్రసిద్ధ చిత్రపూర్ మఠాన్ని యశ్ సందర్శించాడు.

TFN Adminవాట్సాప్
Mahesh Babu's Murari Movie Completed 23 Years
సినిమా వార్తలు

మహేష్ బాబు 'మురారి'కి నేటితో 23 ఏళ్ళు పూర్తి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రాలలో 'మురారి' సినిమాది ప్రత్యేక స్థానం. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించగా.. మహేష్ సరసన బాలీవుడ్ భామ సోనాలి బెంద్రే కథానాయికగా నటించింది. అలాగే సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీ రావు, అన్నపూర్ణ, ప్రసాద్ బాబు, లక్ష్మి, శివాజీ రాజా, చిన్నా, హేమ, అనిత చౌదరి, రవి బాబు, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక విశేషమేమంటే.. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న నందిని రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేయడం. కాగా ఈ మూవీ విడుదలై నేటికి 23 సంవత్సరాలు అయింది. ఈ నేపథ్యంలో మురారి చిత్రం…

Srikanth Mవాట్సాప్
ravi teja mr bachchan shooting update
షూటింగ్ అప్‌డేట్

మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్ డేట్

మాస్ మహారాజా రవితేజ మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా డీసెంట్ హిట్ నే అందించింది. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఒకటి. ఈసినిమా షూటింగ్ ను కూడా రీసెంట్ గానే ప్రారంభించారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
grand welcome to new couple ashish reddy and advaita reddy
సినిమా వార్తలు

నవ దంపతులకు గ్రాండ్ వెల్ కమ్

మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకున్నాడు కుర్ర హీరో ఆశిష్ రెడ్డి. దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన ఆశిష్ రెడ్డి మంచి ప్రశంసలు దక్కించుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఆశిష్ రెడ్డి. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కాశీ దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా వస్తున్న సినిమా సెల్ఫిష్. ఈసినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఇంకా ఈసినిమాతో పాటు అరుణ్ భీమవరపు దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్నాడు. యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ఈసినిమా రాబోతుంది.ఈసినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
ooru peru bhairavakona movie first day collections
బాక్సాఫీస్

ఊరు పేరు భైరవకోన ఫస్ట్ డే కలెక్షన్స్

ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి నమ్మకాన్ని ఏర్పరుచుకుంది. దానికి తోడు ప్రీమియర్ షోలకు కూడా మంచి టాక్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కేవలం ప్రీమియర్ షో లకే రూ కోటి రూపాయల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమాకు మంచి రివ్యూసే వచ్చాయి. చాలా కాలం తరువాత సందీప్ కిషన్ కు ఈసినిమాతో డీసెంట్ హిట్ దక్కింది. ఇక ఈసినిమా ఫస్ట్ కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. మొదటి రోజు ఈసినిమా 6కోట్ల కలెక్షన్స్ ను…

TFN Adminవాట్సాప్
Gopichand Visited Vijayawada Kanaka Durga Temple Before Bhimaa Promotions
సినిమా వార్తలు

భీమా ప్ర‌మోష‌న్స్ షురూ.. దుర్గమ్మను దర్శించుకున్న గోపీచంద్

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్వామి జే సినిమాటోగ్రాఫర్‌ కాగా, కేజీఎఫ్‌ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్‌, టీజర్ మరియు ఫస్ట్ సింగిల్ 'ఏదో ఏదో మాయ' ప్రేక్షకులను అలరించడంతో పాటు అంచనాలను పెంచేశాయి.

Srikanth Mవాట్సాప్

షేర్