కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 175

Four films will be released this week
సినిమా వార్తలు

ఈవారం విడుదలవుతున్న సినిమాలు ఇవే

ఎలక్షన్ ఫీవర్ అలాగే ఐపీఎల్ వల్ల సినిమాల హడావిడి తగ్గిపోయింది.టాలీవుడ్ లోనైతే ప్రస్తుతం కేవలం చిన్న సినిమాలే విడుదలవుతున్నాయి.గత వారం డబ్బింగ్ సినిమా రత్నం ఒక్కటే చెప్పుకోదగ్గ సినిమాగా రిలీజ్ అయ్యింది.అయితే ఈవారం నాలుగు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.అందులో అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు ఒకటి. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం నరేష్ స్ట్రాంగ్ జోన్ సినిమా కావడం వీటికి తోడు పాన్ ఇండియా సబ్జెక్టు తో వస్తుండడం ఈసినిమాకు అడ్వాంటేజ్ కానున్నాయి.ఇందులో ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా మల్లి అంకం డైరెక్ట్ చేశాడు.ఈ శుక్రవారం విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్
Gangs Of Godavari Sequel Confirmed
సినిమా వార్తలు

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సీక్వెల్ కూడా

యంగ్ హీరో విశ్వక్ సేన్ మొదటి సారి ఊర మాస్ రోల్ లో నటిస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేశారు.టీజర్ లో ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించాడు విశ్వక్.రూరల్ బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తుంది.దసరా టైప్ లో ఫుల్ యాక్షన్ సబ్జెక్ట్ ఇది.ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా వుండనుందట.సీక్వెల్ కు సరిపడా కంటెంట్ తో వస్తుందట గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దాంతో సీక్వెల్ కంఫర్మ్ గా ఉంటుందని న్యూస్.అయితే ఫస్ట్ పార్ట్ రిజల్ట్ ను బట్టే సీక్వెల్ తీయడం ఆధారపడి ఉంటుంది.

Mahender Reddyవాట్సాప్
Kalki 2898 AD Telugu Movie Nizam Rights
సినిమా వార్తలు

కల్కి 2898 ఏడీ ప్రముఖ సంస్థకు నైజాం రైట్స్

ప్రస్తుతం ప్రభాస్ లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా.. వాటిలో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది మాత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి సినిమా కోసం. ఈసినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, వీడియోలు రిలీజ్ చేయగా అవి సినిమాపై క్రేజ్ ను మరింత పెంచాయి.

TFN Adminవాట్సాప్
maa oori polimera 2 movie selected for 14th dada saheb phalke film festival
సినిమా వార్తలు

పొలిమేర 2 కు దక్కిన అరుదైన గౌరవం

అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో స‌త్యం రాజేష్‌ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా పొలిమేర 2. ఈసినిమా పొలిమేర సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. హార్రర్ నేపథ్యంలో మూఢనమ్మకాలు, చేతబడుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈసినిమా ఓటీటీ లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. దీంతో ఈసినిమాకు సీక్వెల్ గా పొలిమేర 2 ను తీశారు. ఈసినిమా కూడా సూపర్ హిట్ అయింది.

TFN Adminవాట్సాప్
priyadarshi new movie announcement
సినిమా వార్తలు

ప్రియదర్శి కొత్త సినిమా అనౌన్స్ మెంట్

సపోర్టింగ్ రోల్స్ నుండి ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తూ కెరీర్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ప్రియదర్శి. బలగంతో పెద్ద విజయాన్ని అందుకున్న ప్రియదర్శి ఈ ఏడాది ఓం భీమ్ బుష్‌తో బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నాడు. సేవ్ ది టైగర్స్ ఫ్రాంచైజీ తెలుగు ఒరిజినల్ ఆల్ టైమ్‌లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. ప్రస్తుతం అయితే పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు ప్రియదర్శి లైన్ లో ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Superstar Mahesh Babu Fun with Sister Manjula Video Goes Viral
సినిమా వార్తలు

వైరల్‍గా మహేష్‌ బాబు, సోదరి మంజుల ఫన్నీ వీడియో

టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు వృత్తిపరంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీల్డ్‌లో ఉంటున్నప్పటికీ కుటుంబానికి తగినంత సమయం కేటాయిస్తుంటారు. అభిమానులకు ఆయన పెద్ద స్టార్‌ హీరో అయినప్పటికీ.. ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి సాధారణ వ్యక్తిలానే ఉంటుంటారు. అలాగే తన తోబుట్టువులు, బంధువులతో ప్రేమగా ఉంటారని మహేష్‌ బాబు సన్నిహితులు చెబుతుంటారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Samantha Ruth Prabhu's First Look Revealed From Maa Inti Bangaram
ఫస్ట్ లుక్

సమంత కొత్త మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కండరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె కొన్ని రోజులుగా దానికి చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సమంత తాజాగా తన తదుపరి సినిమాను ప్రారంభించారు. ఈ మేరకు ఆదివారం జన్మదినం సందర్భంగా కొత్త మూవీకి సంబంధించి ఒక అధికారిక ప్రకటన చేసింది. ఈ నయా ప్రాజెక్ట్ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. ఈ చిత్రానికి 'మా ఇంటి బంగారం' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

Srikanth Mవాట్సాప్
manamey movie second single release date fixed
రిలీజ్ అప్‌డేట్

మనమే సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీరామ్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా మనమే. చాలా గ్యాప్ తరువాత శర్వానంద్ నుండి వస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైప ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ అయితే ఆకట్టుకొని సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

TFN Adminవాట్సాప్
gam gam ganesha movie release date update
రిలీజ్ అప్‌డేట్

గం గం గణేశా రిలీజ్ డేట్ అప్ డేట్

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. తన సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. రీసెంట్ గానే బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. అంతేకాదు ఆనంద్ నటనకు కూడా ప్రత్యేకమైన ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా గం గం గణేశా. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
Harom Hara movie new release date fixed
రిలీజ్ అప్‌డేట్

హరోం హర కొత్త రిలీజ్ డేట్

జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా హరోం హర. ఈసినిమా డిఫరెంట్ కథతో రాబోతున్నట్టు తెలుస్తుంది. కుప్పం నేపథ్యంలో డివైన్ టచ్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Manjummel Boys wiil be streaming from May 5th on Disney Plus Hotstar
ఓటీటీ

మంజుమ్మల్ బాయ్స్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ ఓటిటి లోకి వచ్చేస్తుంది.వచ్చే నెల 5నుండి ఈసినిమా తెలుగుతోపాటు మలయాళ ,కన్నడ, తెలుగు, తమిళ ,హిందీ భాషల్లోస్ట్రీమింగ్ లోకి రానుందని స్ట్రీమింగ్ పార్టనర్ హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది.ఇక ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.ప్రపంచ వ్యాప్తంగా 230కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మలయాళం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.అంతేకాదు 200కోట్ల క్లబ్ లో చేరిన మొదటి మలయాళ సినిమా కూడా ఇదే.

TFN Adminవాట్సాప్
Kalki 2898 AD Movie new Release Date fixed
రిలీజ్ అప్‌డేట్

కల్కి 2898AD కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కల్కి 2898ఏడి.. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ సాంకేతికతో ఈసినిమాను రూపొందిస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇక ఈసినిమా రిలీజ్ విషయంపై గత కొద్దిరోలుజుగా పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి ఈసినిమాను మే9వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ పలు కారణాల వల్ల ఈసినిమా చెప్పిన డేట్ కు రావట్లేదని.. వాయిదా పడే అవకాశం ఉంటుందని పలు కథనాలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. ఈసినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. మే నుండి ఈసినిమాను జూన్ కు పోస్ట్…

TFN Adminవాట్సాప్
gangs of godavari movie teaser out now
ట్రైలర్ & టీజర్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాాలను రిలీజ్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈసినిమా వస్తుంది. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ విశ్వక్ మధ్యలో వేరే సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు మే 17వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
rowdy boys re release gets super response
సినిమా వార్తలు

రౌడీ బాయ్స్ రీ రిలీజ్ కు సూపర్ రెస్పాన్స్

టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. చిన్న సినిమా అని లేదు పెద్ద సినిమా అని లేదు అన్ని సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా రీ రిలీజ్ అయిన సినిమా రౌడీ బాయ్స్. హుషారు సినిమా ఫేం శ్రీహ‌ర్ష క‌నుగంటి ద‌ర్శ‌క‌త్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా వచ్చింది ఈసినిమా. ఈసినిమాతోనే ఆశిష్ రెడ్డి హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈసినిమా మంచి హిట్ నే అందించింది.

TFN Adminవాట్సాప్
thalapathy vijay goat movie second single update
సాంగ్

గోట్ సెకండ్ సాంగ్ పై డైరెక్టర్ అప్ డేట్

దళపతి విజయ్ నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
ghilli creates all time record
సినిమా వార్తలు

ఆల్ టైం రికార్డ్ క్రీయేట్ చేసిన విజయ్ రీ రిలీజ్ సినిమా

రీ రీలీజ్ సినిమాల్లో దళపతి విజయ్ నటించిన గిల్లి అల్ టైం రికార్డు సృష్టించింది.ప్రస్తుతం కోలీవుడ్ లో పెద్ద సినిమాలు ఏవి విడుదలలేకపోవడంతో రీసెంట్ గా రీ రిలీజైన గిల్లి సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకుంటుంది.ఈసినిమా నిన్నటి వరకు 20కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. మరి ఈరికార్డును ఏ రీ రీలీజ్ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
vakeel Saab Movie Re Release Date
సినిమా వార్తలు

రీ రిలీజ్ కానున్న వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ మళ్ళీ రిలీజ్ కానుంది.అజ్ఞాతవాసి తరువాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న పవన్, వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. 2021లో వచ్చిన ఈసినిమా 100కోట్ల కుపైగా వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.కరోనా వల్ల కొంచెం ఎఫెక్ట్ పడింది కానీ లేదంటే 200కోట్ల వసూళ్లను రాబట్టేదే.ఇక ఈసినిమాను మే 1న రీ రిలీజ్ చేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
nelson dilipkumar reveals his dream cast
సినిమా వార్తలు

నెల్సన్ దిలీప్ కుమార్ డ్రీమ్ కాస్ట్

ఎంత మంది హీరోయిలతో చేసినా కొంతమంది డైరెక్టర్లకు కూడా పలానా హీరోతే చేయాలనో.. పలానా హీరోయిన్ తో చేయాలనో అనుకుంటారు. తమ డ్రీమ్ ను నెరవేర్చుకుంటారు. ఇక ఇక్కడ ఓ డైరెక్టర్ కు కూడా డ్రీమ్ కాస్టింగ్ ఉంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. తమిళ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. గత ఏడాది రజనీకాంత్ తో జైలర్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు నెల్సన్.

TFN Adminవాట్సాప్
pushpa kesava characher first choice suhas says sukumar
సినిమా వార్తలు

పుష్ప లో కేశవ ఫస్ట్ ఛాయిస్ సుహాస్

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో కూడా చూశాం. బన్నీ నటన, యాక్షన్, సుకుమార్ స్క్రీన్ ప్లే, దేవి మ్యూజిక్ ఇంకా అన్ని అంశాలు కలిసొచ్చి సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. ఇక ఈసినిమాలో కేశవ పాత్ర కూడా ఈసినిమాకు ఎంత కలిసొచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా కథను మొదటి నుండి చివరకి వరకూ చెప్పడమే కాకుండా, అల్లు అర్జున్ పక్కనే ఉంటూ తన యాసతో, తన కామెడీ టైమింగ్ తో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Suhas's Prasanna Vadanam Trailer Released
ట్రైలర్ & టీజర్

ప్రసన్న వదనం ట్రైలర్‌ రిలీజ్.. ఇరగదీసిన సుహాస్

టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి తన ప్రతిభతో క్యారక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి హీరో స్టార్‌డమ్ సొంతం చేసుకున్నవారిలో సుహాస్ ఒకడు. కెరీర్‌ ప్రారంభంలో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశం దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఒకవైపు కమెడియన్‌గా, విలన్‌గా నటిస్తూనే.. తొలిసారిగా 'కలర్ ఫోటో' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత వరుసగా.. 'రైటర్ పద్మభూషణ్', 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుకున్నాడు.

Srikanth Mవాట్సాప్

షేర్