
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 43


'చోర్ బజార్' రిలీజ్ డేట్ ఫిక్స్..!

"పక్కా కమర్షియల్ " ట్రైలర్ రిలీజ్

కమల్ హాసన్ కు మెగా స్టార్ చిరంజీవి సన్మానం

వైరల్ గా సూపర్ స్టార్ పిక్..!

'విరాటపర్వం' గొప్ప ప్రేమ కావ్యం..!

'బ్రహ్మాస్త్ర' కోసం మెగాస్టార్!

సెప్టెంబర్ కు షిఫ్ట్ అయిన 18 పేజెస్..!

"మేజర్ " మూవీ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

సాయి పల్లవి తప్ప ఎవరూ చేయలేరు..!

'టాప్ గేర్' అంటున్న ఆది..!

'ఖైదీ2' లైన్ రివీల్ చేసిన లోకేష్..!

బెంగుళూరు నాగరత్నమ్మ బయోపిక్ మూవీ అప్ డేట్

"ప్రిన్స్ "మూవీ కథానాయిక లుక్ రిలీజ్

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన 'ప్రణీత'

విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేసిన "దర్జా " మూవీ ట్రైలర్

"ముగ్ధ "మనోహరంగా అనుపమ

"గ్యాంగ్ స్టర్ గంగరాజు” ట్రైలర్ రిలీజ్
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై ఈశాన్ సూర్య దర్శకత్వం లో లక్ష్ చదలవాడ హీరోగా తెరకెక్కిన " గ్యాంగ్ స్టర్ గంగరాజు" మూవీ జూన్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. వేదిక దత్త్ కథానాయిక.ఈ మూవీ లో వెన్నెల కిషోర్, చరణ్ డీప్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, రాజేశ్వరి నాయర్, సత్య కృష్ణన్, రవితేజ నన్నిమల, సమ్మెట గాంధీ, అన్నపూర్ణ, నిహర్ కపూర్, రాజేంద్ర, అను మానస, లావణ్య రెడ్డి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి సాయి కార్తీక్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'చోర్ బజార్' రిలీజ్ డేట్ ఫిక్స్..!
బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి ఆంధ్రా పోరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు ఆకాష్ పూరీ. అయితే మొదటి సినిమా బక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఆతరువాత మెహబూబా, రొమాంటిక్ సినిమాలు చేసినా అవి కూడా విజయాన్ని అందించలేకపోయాయి. ఇప్పుడు మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు ఆకాష్. జార్జ్ రెడ్డి చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు జీవన్ రెడ్డితో కలిసి చోర్ బజార్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈసినిమా అన్ని పనులు పూర్తి చేసుకుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కు మంచి…

"ఆర్ ఆర్ ఆర్ " మూవీ ఓటీటీ రికార్డ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

"పక్కా కమర్షియల్ " ట్రైలర్ రిలీజ్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” మూవీ జులై 1 వ తేదీ రిలీజ్ కానుంది. సత్యరాజ్ , అనసూయ , రావు రమేష్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కమల్ హాసన్ కు మెగా స్టార్ చిరంజీవి సన్మానం
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ప్రత్యేక పాత్రలో కనిపించిన సూర్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.ప్రపంచవ్యాప్తంగా వారం రోజులలో 250…

వైరల్ గా సూపర్ స్టార్ పిక్..!
సినిమా సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఫ్యామిలితో ట్రిప్ కు వెళ్లడం అందరికీ తెలిసిందే కదా. ఇది మహేష్ కు ఎప్పటి నుండో ఉన్న అలవాటే. సినిమా పూర్తయిందంటే చాలు కొంత సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తాడు. సరదాగా ఫ్యామిలితో విదేశాలకు ట్రిప్ వేసేస్తాడు. ఇక ఇప్పుడు పరుశురాం దర్శకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయి మంచి బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇక ఆసినిమా హిట్ అవ్వడంతో కుటుంబంతో కలిసి సెలవులను ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్.

'విరాటపర్వం' గొప్ప ప్రేమ కావ్యం..!
పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, న్యాచురల్ పెర్ఫార్మర్ సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం 'విరాటపర్వం'. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ వరంగల్ లో ఆత్మీయ వేడుక నిర్వహించింది. చిత్ర బృందంతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

'బ్రహ్మాస్త్ర' కోసం మెగాస్టార్!
బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తుంది ఈసినిమా. పాన్ ఇండియా వైడ్ గా ఈసినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. అందుకే ఈసినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ను బట్టి ఈసినిమా మంచి విజువల్ ట్రీట్ అయితే ఇవ్వబోతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికే ఈసినిమాలో పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈసినిమాలో టాలీవుడ్ నుండి అగ్రహీరో నాగార్జున కూడా నటిస్తుండటంతో సౌత్ నుండి కూడా బాగానే సపోర్ట్ అందుతుంది. మరోవైపు రాజమౌళికి బ్రహ్మాస్త్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్ కు మధ్య మంచి రాపో ఉండటంతో సౌత్…

సెప్టెంబర్ కు షిఫ్ట్ అయిన 18 పేజెస్..!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మొత్తానికి ఈ ఏడాది రెండు మూడు సినిమాలను రిలీజ్ చేసేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం 18 పేజెస్, కార్తికేయ 2, స్పై సినిమాలు తన లిస్ట్ లో ఉండగా మూడు సినిమాలు కూడా దాదాపు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఈమూడు సినిమాల్లో 18 పేజెస్ సినిమా ముందు షూటింగ్ ను ప్రారంభించుకుంది. అయితే ఈసినిమా షూటింగ్ కూడా పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. నిజానికి ఈసినిమా కూడా ముందే రిలీజ్ అవ్వాలి కానీ లేట్ అవుతూ వస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ లో ఈసినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట…

"మేజర్ " మూవీ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షక , విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

సాయి పల్లవి తప్ప ఎవరూ చేయలేరు..!
వేడు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న సినిమా విరాటపర్వం. కాస్త డిఫరెంట్ కథతో వస్తుండటంతో ఈసినిమాపై మొదటి నుండి అందరికీ ఆసక్తి ఉంది. అందులోనూ రానా, సాయి పల్లవి లాంటి టాలెంటెడ్ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తుండటంతో ఖచ్చితంగా ఈసినిమా విభిన్నంగా ఉంటుందని ఫిక్స్ అయ్యారు అందరూ. ఇక ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఈసినిమా ఫైనల్ గా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ముందు జులై 1వ తేదీన రిలీజ్ డేట్ ను ప్రకటించి ఆ తర్వాత ప్రీ పోన్ చేశారు. ఫైనల్ గా ఈనెల 17వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో రిలీజ్ కు ఇంకా చాలా తక్కువ టైమ్ ఉండటంతోప్రమోషన్స్ మాత్రం బాగానే చేస్తున్నారు. మరోవైపు ఈసినిమా నుండి…

'టాప్ గేర్' అంటున్న ఆది..!
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ మాత్రం ఎక్కడా తగ్గేదేలే అంటున్నాడు. టాలీవుడ్ లో యంగ్ హీరోలందరూ రెండు, మూడు సినిమాలను లైన్ లో పెడుతుంటే.. ఆది మాత్రం డజనువరకూ సినిమాలను లైన్ లో పెట్టాడు. రీసెంట్ గానే ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న బ్లాక్ సినిమాను రిలీజ్ అయింది. ప్రస్తుతం అయితే ఆది లిస్ట్ లో అమరన్, కిరాతక, క్రేజీ ఫెల్లో, తీస్ మార్ ఖాన్, అతిథి దేవో భవ ఇలా పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకోగా కొన్ని షూటింగ్ ను జరుపుకంటున్నాయి.

'ఖైదీ2' లైన్ రివీల్ చేసిన లోకేష్..!
దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈసినిమా.. మంచి విజయం దక్కించుకుంది. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగు ఆడియన్స్‌ను కూడా ఈసినిమా ఆకట్టుకుంది. హీరోయిన్ .. పాటలు .. కామెడీ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా ఘన విజయాన్ని అందుకుంది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

బెంగుళూరు నాగరత్నమ్మ బయోపిక్ మూవీ అప్ డేట్
భోగినీ గా జీవితం ప్రారంభించి చివరకు యోగినిగా బతుకు చాలించిన గొప్ప మహిళ బెంగళూరు నాగరత్నమ్మ . 1878సంవత్సరం లో పుట్టిన నాగరత్నమ్మ భరత నాట్యానికి, కర్ణాటక సంగీతానికి ఎంతో సేవ చేశారు. ఆమెకు త్యాగరాజ స్వామి అంటే ఆరాధనా భావం.కావేరి నది ఒడ్డున ఆయన సమాధి శిధిలావస్థలో ఉంటే ఆ స్థలం కొని అక్కడ ఆయనకు ఓ గుడి కట్టించారు. బెంగళూరు నాగరత్నమ్మ బయోపిక్ మూవీ ని పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు.

"ప్రిన్స్ "మూవీ కథానాయిక లుక్ రిలీజ్
సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు” మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివకార్తికేయన్ , ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్కా జంటగా తెలుగు , తమిళ భాషలలో “#SK 20” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో శివకార్తికేయన్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ తో ఆయన టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన 'ప్రణీత'
కరోనా వల్ల సినీ పరిశ్రమకు చాలా ఇబ్బందులు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి.. ఎన్నో సినిమాల షూటింగ్ లు మద్యలోనే ఆగిపోయాయి. అయితే కరోనా మాత్రం సెలబ్రిటీల పెళ్లిళ్లకు బాగానే కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఎంతో మంది హీరో హీరోయిన్ల పెళ్లిళ్లు కరోనా టైమ్ లోనే జరిగాయి. అందులో నటి ప్రణీత సుభాష్ కూడా ఉంది. కరోనా టైమ్ లోనే ప్రణీత వివాహం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా కొద్దిమంది సమక్షంలో ప్రణీత వివాహం జరిగింది. రాజు అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకుంది.

10 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న "#NBK107" మూవీ ఫస్ట్ హంట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

ఓవర్సీస్ లో "అంటే .. సుందరానికీ!" మూవీ కి అద్భుత స్పందన
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈమూవీ లో హీరో నాని తన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.సంప్రదాయ బ్రాహ్మణ కుర్రాడిగా నటించి ఆ పాత్రకి న్యాయం చేశారు.నజ్రియా నజీమ్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేసిన "దర్జా " మూవీ ట్రైలర్
కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సలీమ్ మాలిక్ దర్శకత్వంలో సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం "దర్జా" తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), శిరీష, షకలక శంకర్ ముఖ్య పాత్రలలో నటించారు. ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శివశంకర్ పైడిపాటి నిర్మాత కాగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు.

"ముగ్ధ "మనోహరంగా అనుపమ
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ జూలై 22 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.