‘బ్రహ్మాస్త్ర’ కోసం మెగాస్టార్!

Megastar to Give Voice For Brahmastra Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Brahmastra,Brahmastra Movie,Brahmastra Telugu Movie,Brahmastra New Movie Updates,Brahmastra latest Updates,Megastar Chiranjeevi,Chiranjeevi to Give Voice to Brahmastra Movie. Chiranjeevi Vioce For Brahmastra Movie,Chiranjeevi Upcoming Movies,Chiranjeevi Latest Movie Updates,Chiranjeevi New Movie Updates,Chiranjeevi upcoming Movie

బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తుంది ఈసినిమా. పాన్ ఇండియా వైడ్ గా ఈసినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. అందుకే ఈసినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ను బట్టి ఈసినిమా మంచి విజువల్ ట్రీట్ అయితే ఇవ్వబోతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికే ఈసినిమాలో పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈసినిమాలో టాలీవుడ్ నుండి అగ్రహీరో నాగార్జున కూడా నటిస్తుండటంతో సౌత్ నుండి కూడా బాగానే సపోర్ట్ అందుతుంది. మరోవైపు రాజమౌళికి బ్రహ్మాస్త్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్ కు మధ్య మంచి రాపో ఉండటంతో సౌత్ ప్రమోషన్స్ బాధ్యత మొత్తం తనే తీసుకున్నాడు. ఇప్పుడు దానికితోడు మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తోడైంది. ఈసినిమాలో మెగాస్టార్ కూడా ఒక చేయి వేస్తున్నారు. అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రానికి తన గాత్రాన్ని అందించబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు వచ్చేసింది. ఈసినిమా ట్రైలర్ కోసం మెగాస్టార్ చిరు తన గాత్రాన్ని అందించారు. మరి ముందు ముందు ఇంకెన్ని ఆసక్తికర విషయాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా ముగించుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా మూడు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో మొదటి భాగమైన బ్రహ్మాస్త్ర-శివ ను సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే పలు గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా అమితాబ్, నాగ్ లుక్ లను కూడా రివీల్ చేశారు. పవర్ ఫుల్ గా ఉన్న వీరి లుక్ లకు మంచి రెస్పాన్సే వచ్చింది. జూన్ 15వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

కాగా మైథ‌లాజిక‌ల్ అడ్వెంచ‌రస్ డ్రామాగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాను ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై క‌ర‌ణ్ జోహార్‌, ర‌ణ్ బీర్ క‌పూర్‌, అయాన్ ముఖ‌ర్జీ, అపూర్వ మెహ‌తా, న‌మిత్ మ‌ల్హోత్రా బ్ర‌హ్మాస్త్ర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − nine =