కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సలీమ్ మాలిక్ దర్శకత్వంలో సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం “దర్జా” తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), శిరీష, షకలక శంకర్ ముఖ్య పాత్రలలో నటించారు. ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శివశంకర్ పైడిపాటి నిర్మాత కాగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“దర్జా ” మూవీ ట్రైలర్ ను స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఆవిష్కరించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “దర్జా “మూవీ ట్రైలర్ చాలా బాగుందనీ , .చాలా రిచ్‌గా చిత్రీకరించారనీ , ఈ మూవీ లో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్అనీ , ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననీ చెప్పారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి మాట్లాడుతూ… .మా “దర్జా” సినిమా ట్రైలర్ విడుదల చేసి, ఆశీస్సులు అందించిన ప్రముఖ హీరో వెంకటేష్ గారికి మా టీమ్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలనీ , అలాగే మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కామినేని శ్రీనివాస్ గారికి ధన్యవాదాలనీ అన్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: