సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షక , విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మేజర్ ” మూవీ దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో , విశేష ప్రేక్షకాదరణ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.“మేజర్ ” మూవీకి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా జన సేన అధ్యక్షులు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “మేజర్ ” మూవీ పై ప్రశంసలు కురిపిస్తూ , “మేజర్ ” మూవీ టీమ్ కు అభినందనలు తెలుపుతూ ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: