బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి ఆంధ్రా పోరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు ఆకాష్ పూరీ. అయితే మొదటి సినిమా బక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఆతరువాత మెహబూబా, రొమాంటిక్ సినిమాలు చేసినా అవి కూడా విజయాన్ని అందించలేకపోయాయి. ఇప్పుడు మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు ఆకాష్. జార్జ్ రెడ్డి చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు జీవన్ రెడ్డితో కలిసి చోర్ బజార్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈసినిమా అన్ని పనులు పూర్తి చేసుకుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా పాటలు హిట్ అయ్యాయి. వీటన్నింటి వల్ల ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈనెల 24న ఈసినిమాగ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
We are elated and proud to present @ActorAkashPuri much-awaited film, #Chorbazaar
Releasing in theatres near you on June 24th!@gehna_sippy @GeorgeReddyG1 @VSRajuOfficial @IVProductions_ @sureshvarmaz @DopJagadeesh @sureshbobbili9 @GskMedia_PR @UV_Creations @LahariMusic pic.twitter.com/pgSFE1hZho
— UV Creations (@UV_Creations) June 13, 2022
కాగా లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో సుబ్బరాజు, పోసాని, లేడీస్ టైలర్ ఫేమ్ అర్చన కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























