సెప్టెంబర్ కు షిఫ్ట్ అయిన 18 పేజెస్..!

18 Pages Movie Release Date Locked?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, 18Pages,18 Pages Movie,Nikhil Siddharth 18 Pages Movie Updates,Nikhil Siddharth 18 Pages Telugu Movie,18 Pages Movie,18 Pages Telugu Movie,18 Pages Nikhil Siddharth Movie, Nikhil Siddharth,Hero Nikhil Siddharth,Nikhil Siddharth Movie 18 Pages Shifted to September,Nikhil Siddharth Movie 18 Pages Postponde to September, Nikhil Siddharth Movies,Nikhil Siddharth Latest Movie Updates,Nikhil Siddharth New Movie Updates

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మొత్తానికి ఈ ఏడాది రెండు మూడు సినిమాలను రిలీజ్ చేసేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం 18 పేజెస్, కార్తికేయ 2, స్పై సినిమాలు తన లిస్ట్ లో ఉండగా మూడు సినిమాలు కూడా దాదాపు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఈమూడు సినిమాల్లో 18 పేజెస్ సినిమా ముందు షూటింగ్ ను ప్రారంభించుకుంది. అయితే ఈసినిమా షూటింగ్ కూడా పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. నిజానికి ఈసినిమా కూడా ముందే రిలీజ్ అవ్వాలి కానీ లేట్ అవుతూ వస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ లో ఈసినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు డేట్ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. సెప్టెంబర్ 10వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధిాకారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సుకుమార్ ఈ చిత్రానికి కథ- స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక మరోవైపు కార్తికేయ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమాను భారీగా రిలీజ్ చేయనున్నారు. కార్తికేయ 2 జులై 22న విడుద‌ల చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్రక‌టించారు కూడా. ఇంకా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో స్పై సినిమా కూడా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లి చకచకా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈసినిమా కూడా డిఫరెంట్ గానే ఉండబోతుంది. ఈమధ్యనే ఈసినిమా నుండి నిఖిల్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఈసినిమాను కూడా ఈఏడాది చివరిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =