
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 41


"#SSMB 28" మూవీ అప్ డేట్

ఫ్లోరెన్స్‌లో రామ్ చరణ్ హార్స్ రైడింగ్

తన సినిమాలో తానే అతిథి పాత్రలో..!

300 కోట్లు సంపాదిస్తానన్నా ఎవరూ నమ్మలేదు..!


రామ్ చరణ్ , ఉపాసన రాయల్ లుక్

విజయ్ కు విలన్ గా ధనుష్..?

"సలార్" మూవీ లో ప్రభాస్ కై స్పెషల్ జీప్

కన్ఫామ్.. ఏజెంట్ తో శ్రీలీల..!

పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం - సాయి పల్లవి

విజువల్ వండర్ గా 'బ్రహ్మాస్త్రం' ట్రైలర్

స్కూల్స్ కు "మేజర్"టీమ్ స్పెషల్ ఆఫర్

'విరాట పర్వం' కోసం ముగ్గురు స్టార్ సెలబ్రిటీలు

'చంద్రముఖి 2' క్రేజీ అప్ డేట్..!

'మేజర్' 13 రోజుల కలెక్షన్స్..!
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ మేజర్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. శశి కిరణ్ తిక్క, అడివి శేష్ దర్శకత్వంలో వచ్చిన గూఢచారి సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే కాంబినేషన్ లో మేజర్ సినిమా తెరకెక్కించి మరో హిట్ ను సొంతం చేసుకున్నారు. మేజర్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ను తీసి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. ఈసినిమాను ఒక సినిమాలా కాకుండా ఒక ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు అందరూ. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ నటన అందరినీ ఆకట్టుకుంది. అందుకే ఇక్కడ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా అలానే విదేశాల్లో కూడా మేజర్ కు అందరూ ఫిదా అయిపోయారు.

"#SSMB 28" మూవీ అప్ డేట్
శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా #SSMB 28 ” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. “అతడు “, “ఖలేజా ” మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB 28 ”మూవీ పూజా కార్యక్రమం తో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ పూజా కార్యక్రమానికి మహేష్ బాబు సతీమణి నమ్రత , హీరోయిన్ పూజాహెగ్డే హాజరు అయ్యారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న “#SSMB 28″మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

'హ్యాపీ బర్త్ డే'.. 'అమాయక అగరబత్తి' గా నరేష్ అగస్త్య..!
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా హ్యాపీ బర్త్ డే. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గా నే ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కినట్టు ఈటీజర్ ను చూస్తే అర్థమవుతుంది. మరోవైపు ఈసినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న వారి పోస్టర్లు వరుసగా రిలీజ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఈసినిమాలో నటిస్తున్న వెన్నెల కిషోర్ పాత్రను రివీల్ చేశారు. రిత్విక్ పాత్రలో…

ఫ్లోరెన్స్‌లో రామ్ చరణ్ హార్స్ రైడింగ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. #RC15” మూవీ తరువాత సూపర్ హిట్ "జెర్సీ" మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక మూవీ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

తన సినిమాలో తానే అతిథి పాత్రలో..!
సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సినిమా సూరరై పోట్రు. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జిఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా సూరారై పోట్రు గా తెరకెక్కిన ఈసినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. తెలుగులో ఈసినిమా ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. లాక్ డౌన్ లో ఈసినిమా రిలీజ్ అయింది. థియేటర్స్ లేని నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల చేశారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా కావడంతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఈసినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

300 కోట్లు సంపాదిస్తానన్నా ఎవరూ నమ్మలేదు..!
లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఫుల్ హ్యాపీలో ఉన్నారు. దానికి కారణం విక్రమ్ బ్లాక్ బస్టర్ కొట్టడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమల్ నుండి మూవీ వచ్చి దాదాపు నాలుగేళ్లు పైన అయిపోయింది. అందులోనూ కమల్ మంచి హిట్ కొట్టి కూడా చాలా కాలం అయిపోయింది. అలాంటి నేపథ్యంలో విక్రమ్ తో ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసితో వెయిట్ చేశారు. ఇక ఈసినిమా ప్రారంభించిన తరువాత మధ్యలో కరోనా వల్ల బ్రేక్ లు పడ్డాయి.. ఆ తరువాత పలు కారణాల వల్ల కూడా లేట్ అవుతూ వచ్చింది. ఫైనల్ గా ఈనెల 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈసినిమా.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'గ్యాంగ్ స్టర్ గంగరాజు'
టాలీవుడ్ యంగ్ హీరో లక్ష్ కూడా ఒకదాని తరువాత ఒకటి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తను నటించిన గ్యాంగ్ స్టర్ గంగరాజు సినిమా చేస్తున్నాడు. ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈసినిమా సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైనా కరోనా వల్ల షూట్ కు బ్రేకులు పడ్డాయి. అయితే మళ్లీ ఇటీవలే రీస్టార్ట్ చేశారు. ఇక శరవేగంగా షూటింగ్ జరిపి షూటింగ్ ను కూాడా పూర్తిచేశారు. అంతేకాదు ఈసినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గానే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా.. ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి…

"ఆర్ ఆర్ ఆర్" పై ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ మిల్లర్ ప్రశంసలు
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

'విరాట పర్వం'.. సాయి పల్లవి నటనకు జాతీయ అవార్డ్ వస్తుంది..!
పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, నేచురల్ పెర్ఫార్మర్ సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం 'విరాటపర్వం'. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. చిత్ర బృందంతో పాటు దర్శకుడు కిశోర్ తిరుమల, దర్శకుడు శరత్ మండవ అతిధులుగా విచ్చేశారు.

100 మిలియన్ క్లబ్ లో రామ్ "బుల్లెట్ సాంగ్"
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లోతెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ జూలై 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న “ది వారియర్”మూవీ లో నదియా , ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

రామ్ చరణ్ , ఉపాసన రాయల్ లుక్
2012 జూన్ 14న రామ్ చరణ్ వివాహం ఉపాసన తో జరిగిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం తో వారి వివాహం జరిగి పదేళ్లు అవుతుంది. పదేళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నా ఈ జంట అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఎవరికి వారు కెరీర్ పరంగా తమ స్పేస్‌ని మెయింటైన్ చేస్తూనే ఫ్యామిలీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో రొమాంటిక్ పెయిర్‌గానూ పేరు తెచ్చుకున్నారు. తమ 10వ వెడ్డింగ్ యానివర్సరీ ని రామ్ చరణ్ , ఉపాసన ఇటలీ లో ప్లాన్ చేసుకున్నారు.

'సర్కారు వారి పాట' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా సర్కారు వారి పాట. ఈసినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాస్త లేట్ గా రిలీజ్ అయినా కూడా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ అందించింది. ఇక ఇదిలా ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలో సందడి చేయడానికి వచ్చేస్తుంది. తాాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్.

విజయ్ కు విలన్ గా ధనుష్..?
ఇండస్ట్రీలో ఇప్పుడు ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. ఎవరు ఎవరితో అయినా సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నారు. స్టార్ హీరోలు సైతం ఈ పద్దతికి అలవాటు పడుతున్నారు. ఒకప్పుడు కూడా ఇలా ఉండేది కానీ ఆ తరువాత స్టార్ హీరోలు మ్యాగ్జిమమ్ వారి సినిమాలు వారే చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సినిమా రేంజ్ పెరిగిపోయింది. కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇక హీరోలు కూడా ఏ లాంగ్వేజ్ అయినా సరే చేసేస్తున్నారు. స్టార్ హీరోలు కూడా ఒకే సినిమాలో కనిపించడానికి ఎలాంటి షరతులు పెట్టుకోవడంలేదు.

"సలార్" మూవీ లో ప్రభాస్ కై స్పెషల్ జీప్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.“సలార్” మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. ఈ మూవీ లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు.మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర లో…

కన్ఫామ్.. ఏజెంట్ తో శ్రీలీల..!
ఒక్కోసారి గుర్తింపు రావడం లేటు కావచ్చేమో కానీ ఒక్కసారి వస్తే మాత్రం ఆపడం కష్టం. సినీ ఇండస్ట్రీలో ఇది చాలా ముఖ్యం. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి విషయంలో కూడా అదే జరిగిందని చెప్పొచ్చు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి.. ఆ తరువాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత వచ్చిన జాతిరత్నాలు సినిమాతోనూ మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యంగ్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు…

పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం - సాయి పల్లవి
సురేష్ ప్రొడక్షన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా 90ల కాలం నాటి కొన్ని వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కిన “విరాటపర్వం” మూవీ జూన్ 17 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రియమణి , నందితా దాస్, నివేత పేతురాజ్ , సాయిచంద్ , నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

విజువల్ వండర్ గా 'బ్రహ్మాస్త్రం' ట్రైలర్
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్, అలియాభట్ జంటగా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈసినిమా మూడు పార్ట్ లుగా రిలీజ్ అవుతుండగా.. అందులో మొదటి పార్ట్ సెప్టెంబర్ 9వ తేదీన ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఈనేపథ్యంలో ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ సినిమాపై బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే మొత్తానికి ఈసినిమా నుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది. ఇక ట్రైలర్ చూస్తుంటే విజువల్ ఎఫెక్స్ట్ కు ఫిదా అవ్వాల్సిందే. ఈసినిమా అయాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ఎప్పటినుండో అనుకుంటున్నా 2018లో…

స్కూల్స్ కు "మేజర్"టీమ్ స్పెషల్ ఆఫర్
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

'విరాట పర్వం' కోసం ముగ్గురు స్టార్ సెలబ్రిటీలు
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విరాటపర్వం సినిమా రిలీజ్ కు సిద్దమైంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. గత కొద్ది కాలంగా ఎలాంటి అప్ డేట్ లేదు. రిలీజ్ డేట్ ఫిక్ అయిన దగ్గర నుండే అప్ డేట్స్ఇవ్వడం, ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయడం చేశారు మేకర్స్. అయినా కూడా ఈసినిమా మంచి బజ్ ను సొంతం చేసుకుంది. పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడం.. డిఫరెంట్ కథతో వస్తుండటంతో సినిమాపై అందరికీ ఆసక్తి పెరిగింది.

'చంద్రముఖి 2' క్రేజీ అప్ డేట్..!
పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్‌కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్న సంగతి కూడా తెలిసిందే. దీనిపై ఎప్పుడో ప్రకటన వచ్చిన సంగతి కూడా తెలిసిందే కదా. అయితే ఈసినిమాను ముందు రజనీతోనే అనుకున్నా.. ఫైనల్ గా లారెన్స్ చేస్తున్నాడు. రజనీ ప్లేస్ లో లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా ప్రకటించి చాలా రోజులే అయిపోతుంది.