టాలీవుడ్ యంగ్ హీరో లక్ష్ కూడా ఒకదాని తరువాత ఒకటి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తను నటించిన గ్యాంగ్ స్టర్ గంగరాజు సినిమా చేస్తున్నాడు. ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈసినిమా సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైనా కరోనా వల్ల షూట్ కు బ్రేకులు పడ్డాయి. అయితే మళ్లీ ఇటీవలే రీస్టార్ట్ చేశారు. ఇక శరవేగంగా షూటింగ్ జరిపి షూటింగ్ ను కూాడా పూర్తిచేశారు. అంతేకాదు ఈసినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గానే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా.. ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో వేదిక దత్త హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో వెన్నెల కిషోర్, చరణ్ దీప్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, నిహార్ కపూర్, రాజేశ్వరి నాయర్, సత్యకృష్ణ, రవితేజ నన్నిమాల, సమ్మెట గాంధీ, రాజేంద్ర, అను మానస, లావణ్య రెడ్డి, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























