సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేశ వ్యాప్తంగా , ఓవర్సీస్ లోను దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “మేజర్ “మూవీ టీమ్ స్కూల్స్ కు స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం గురించి ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యాలకు టికెట్ ధరపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. పాఠశాల యాజమాన్యాల కోసం ప్రత్యేక షో వేస్తామని, అందుకోసం [email protected]కి మెయిల్ చేసి ఈ అవకాశాన్ని పొందొచ్చని మేజర్ చిత్రబృందం తెలిపింది. “మేజర్” సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలనీ , చాలామంది చిన్నారులు తనకు ఫోన్ చేసి తాము కూడా మేజర్ సందీప్‌లా దేశం కోసం పోరాడతామని చెబుతున్నారనీ , చిన్నారుల నుంచి వస్తున్న స్పందన తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందనీ , ఈ నేపథ్యంలో ఈ సినిమాను వారి కోసం రాయితీపై ప్రదర్శించాలని నిర్ణయించామనీ , గ్రూప్ టికెట్లపై పాఠశాలలకు రాయితీ కల్పిస్తున్నామనీ, “మేజర్” గురించి రేపటి తరానికి తెలియాలనేదే తమ లక్ష్యమనీ అడవి శేష్ సోషల్ మీడియా లో ఒక వీడియో షేర్ చేశారు .
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: