“సలార్” మూవీ లో ప్రభాస్ కై స్పెషల్ జీప్

Prabhas Salaar Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Movie Updates,Salaar New Movie Updates,Salaar latest News,Salaar pan India Movie,Pan Indian Star Prabhas Salaar Movie updates, Special Jeep For Prabhas in Salaar Movie,Rebel Star Prabhas upcoming Movie Salaar,Salaar Shooting Updates,Salaar Shoot Updates,Salaar New Movie Updates,Prabhas Salaar Movie Shoot Updates, Prabhas Upcoming Movies,Prabhas New Movie Updates,Prabhas latest Movie Updates,Special Build Jeep For Prabhas Salaar Movie

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.“సలార్” మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. ఈ మూవీ లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు.మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఓ కీలక పాత్ర లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటి వరకూ “సలార్” మూవీ 40 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నట్టు సమాచారం. హీరో ప్రభాస్ ఇతర ప్రాజెక్టులలో.. అలాగే, దర్శకుడు ప్రశాంత్ నీల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2″మూవీ కారణంగా “సలార్‌” మూవీ షూటింగ్ కు ఆలస్యం అయ్యింది. “సలార్ ” మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ సీన్ ను తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న
“సలార్” మూవీ లో ప్రభాస్ కై మేకర్స్ స్పెషల్ జీప్ ను సెలెక్ట్ చేశారు. రస్టిక్ లుక్ తో ఈ జీప్ డిజైన్ అయ్యింది. గన్ లేబుల్ కూడా ఈ జీప్ కు ముందు ప్రోపర్టీగా పెట్టారు. ఈ కారు చూడగానే ఓ బీస్ట్ ఫీల్ వస్తోంది. సినిమాలో హీరోయిజం ను ఎలివేట్ చేయటంలో ప్రశాంత్ నీల్ తీరే వేరు. అందుకు సింబాలిక్ గా ఈ జీప్ నిలవనుందని చెప్తున్నారు.ప్రభాస్ ఫ్యాన్స్ ఈ జీప్ మోడల్ చూసి తెగ ఆనందపడుతున్నారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 7 =