పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్‌కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్న సంగతి కూడా తెలిసిందే. దీనిపై ఎప్పుడో ప్రకటన వచ్చిన సంగతి కూడా తెలిసిందే కదా. అయితే ఈసినిమాను ముందు రజనీతోనే అనుకున్నా.. ఫైనల్ గా లారెన్స్ చేస్తున్నాడు. రజనీ ప్లేస్ లో లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా ప్రకటించి చాలా రోజులే అయిపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చాలా కాలం తర్వాత ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ వచ్చింది. భారీ సినిమాలు నిర్మించే లైకా ప్రొడక్షన్ వారి చేతిలోకి ఈసినిమా వెళ్లింది. ఈసినిమా భారీగా నిర్మిస్తున్నట్టు లైకా ప్రొడక్షన్స్ వారు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈసందర్భంగా ఈసినిమా నుండి పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ‘చంద్రముఖి’లో ఉత్కంఠను రేకెత్తించే మేడపై గదినే పోస్టర్ లో చూపించారు.
Positive Vibes ✨ & Happy Faces 😇 all around #Chandramukhi2 🗝️✨
Starring @offl_Lawrence & Vaigaipuyal #Vadivelu 😎
Directed by #PVasu 🎬
Music by @mmkeeravaani 🎶
Cinematography by @RDRajasekar 🎥
Art by #ThottaTharani 🎨
PRO @proyuvraaj 🤝🏻 pic.twitter.com/pf57zgJ7xC— Lyca Productions (@LycaProductions) June 14, 2022
ఇక ఈసినిమాను మాతృకకు దర్శకత్వం వహించిన పి.వాసునే దర్శకత్వంలో వహించనున్నాడు. చంద్రముఖి సినిమాలో నటించిన వడివేలు కూడా ఈసినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు. టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించనున్నారు. ఆర్.జీ రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: