తన సినిమాలో తానే అతిథి పాత్రలో..!

Suriya to play a cameo in Soorarai Pottrus Hindi Remake,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Soorarai Pottrus,Soorarai Pottrus Movie,Soorarai Pottrus Hindi Remake,Hero Suriya,Suriya,Suriya Movie Updates,Suriya Soorarai Potturs Hindi Remake Move Updates, Suriya Upcoming Movies,Suriya Latest Movie Updates,Suriya To act in Soorarai Pottrus Movie,Soorarai Pottrus Movie Latest Updates,Suriya to act in His Own Hindi Remake Movie Soorarai Pottrus

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సినిమా సూరరై పోట్రు. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జిఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా సూరారై పోట్రు గా తెరకెక్కిన ఈసినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. తెలుగులో ఈసినిమా ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. లాక్ డౌన్ లో ఈసినిమా రిలీజ్ అయింది. థియేటర్స్ లేని నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల చేశారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా కావడంతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఈసినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈసినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా గురించి ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. అదేంటంటే.. ఈరీమేక్ లో సూర్య కూడా అతిథి పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఈవార్త అయితే ప్రస్తుతం వైరల్ అవుతుంది. దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈసినిమాలో రాధిక మదన్ హీరోయిన్ గా నటిస్తుంది. సూర్య హోమ్ బ్యానర్ 2డీ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు అబుందాంతియా ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత విక్రమ్ మల్హోత్రా ఈ సినిమాను హిందీలో నిర్మిస్తున్నారు. హిందీలో కూడా ఈసినిమాకు సుధానే దర్శకత్వం వహిస్తున్నారు. మరి తమిళ్, తెలుగులో హిట్ అయిన ఈసినిమా బాలీవుడ్ ప్రేక్షకులను ఎంత వరకూ మెప్పిస్తుందో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 16 =