ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విరాటపర్వం సినిమా రిలీజ్ కు సిద్దమైంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. గత కొద్ది కాలంగా ఎలాంటి అప్ డేట్ లేదు. రిలీజ్ డేట్ ఫిక్ అయిన దగ్గర నుండే అప్ డేట్స్ఇవ్వడం, ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయడం చేశారు మేకర్స్. అయినా కూడా ఈసినిమా మంచి బజ్ ను సొంతం చేసుకుంది. పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడం.. డిఫరెంట్ కథతో వస్తుండటంతో సినిమాపై అందరికీ ఆసక్తి పెరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ కు ఎన్నో రోజుల గడువు లేదు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. ఇక దీనిలో భాగంగానే ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు. అంతేకాదు ఈ ఈవెంట్ కు ఏకంగా ముగ్గురు స్టార్ సెలబ్రిటీలు హాజరు కానున్నారు. జూన్ 15వ తేదీన శిల్ప కళావేదికగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇక ఈ ఈవెంట్ కు అగ్ర హీరో వెంకటేష్ అలాన్ స్టార్ హీరో రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిలుగా రానున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: