కన్ఫామ్.. ఏజెంట్ తో శ్రీలీల..!

Sreeleela Confirmed in Naveen Polishetty Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sreeleela,Actress Sreeleela,Sreeleela Movie Updates,Sreeleela latest updates,Sreeleela Movies,Sreeleela Upcoming movies,Sreeleela in Naveen polishetty Movie, Anaganaga Oka Raju,Anaganaga Oka Raju Movie,Anaganaga Oka Raju Telugu Movie,Anaganaga Oka Raju Movie Updates,Naveen Polishetty upcoming Movie Anaganaga Oka Raju,Sreeleela in Anaganaga Oka Raju Movie Confirmed, Sreeleela To Act with Naveen Polishetty,Sreeleela And Naveen Polishetty New Movie,Sreeleela New Movie with Naveen Polishetty,Sreeleela Next Project with Naveen Polishetty,

ఒక్కోసారి గుర్తింపు రావడం లేటు కావచ్చేమో కానీ ఒక్కసారి వస్తే మాత్రం ఆపడం కష్టం. సినీ ఇండస్ట్రీలో ఇది చాలా ముఖ్యం. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి విషయంలో కూడా అదే జరిగిందని చెప్పొచ్చు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి.. ఆ తరువాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత వచ్చిన జాతిరత్నాలు సినిమాతోనూ మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యంగ్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు వరుసగా పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నాయి నవీన్ పోలిశెట్టికి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే యూవీ క్రియేషన్స్ లాంటి బ్యానర్ లో చేస్తున్నాడు. దీనితో పాటు సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కూడా ఒక సినిమా చేస్తున్నాడు నవీన్ పోలిశెట్టి. అనగనగా ఒకరాజు టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నటించే హీరోయిన్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. ఈసినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్నట్టు ప్రకటించారు. నేడు శ్రీలీల పుట్టిన రోజు కావడంతో శ్రీలీల పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపారు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ప్రొడక్షన్ నంబర్ 15గా ఈసినిమా తెరకెక్కుతుంది. కళ్యాణ్ శంకర్ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈసినిమా కూడా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియచేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =