కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 47

షూటింగ్ అప్‌డేట్

వెకేషన్, యాడ్ షూటింగ్ కై మహేష్ బాబు విదేశ ప్రయాణం

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెంట్, GMB ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు , రష్మిక జంటగా సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.ఈ మూవీ లో లేడీ అమితాబ్ విజయశాంతి తో పాటు ప్రకాష్ రాజ్, నరేష్, సంగీత, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ , బ్రహ్మానందం, అనసూయ, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Bollywood Star Acquires Geetha Govindam Movie Rights,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Rohit Shetty acquires remake rights for the Telugu film Geetha Govindam,Geetha Govindam Movie Updates,Geeth
సినిమా వార్తలు

రోహిత్ శెట్టి చేతిలోకి గీత గోవిందం రీమేక్ రైట్స్

పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన కాంబినేషన్ లో వచ్చిన 'గీత గోవిందం' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అల్లు అరవింద్ మరియు బన్నీ వాసు నిర్మాతలుగా కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 130 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఇంత హిట్ అయిన సినిమానురీమేక్ చేయకుండా ఎలా ఉంటారు. ఇప్పటికే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ ‘లైలా మజ్ను’కు 70 ఏళ్ళు

ప్రేమకథలకు, అందులోనూ విషాదాంత ప్రేమకథలకు చిరునామాగా నిలిచిన‌ కథానాయకుడు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు. అటువంటి నాగేశ్వరరావు నటించిన తొలి ప్రేమకథా చిత్రం ‘లైలా మజ్ను’. ఇంకా చెప్పాలంటే... తెలుగునాట ప్రేమకథా చిత్రాలకు నాంది పలికిన సినిమా ఇది. ఏఎన్నార్ మజ్నుగా, భానుమతి రామకృష్ణ లైలాగా దర్శనమిచ్చిన ఈ చారిత్రాత్మక చిత్రంలో... ముక్కామల, సి.ఎస్.ఆర్, కస్తూరి శివరావు, శ్రీరంజని, హేమలత తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. భానుమతి హోమ్ బ్యానర్ భరణి పిక్చర్స్ పతాకంపై ఆమె భర్త పి.ఎస్.రామకృష్ణారావు నిర్మించి, తెరకెక్కించిన ఈ సినిమా... తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

Team TFNవాట్సాప్
3 Interesting Movies For 2020 Sankranti,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Rajinikanth New Movie Releasing 2020 Sankranti,Vishal Upcoming Movie Releasing For Sankranti,Karthi Latest Movie Releasi
సినిమా వార్తలు

2020 పొంగ‌ల్‌కి మూడు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు

తెలుగువారికి సంక్రాంతి ఎలాగో... త‌మిళుల‌కు పొంగ‌ల్ అలాగా. అందుకే... పొంగ‌ల్ టైమ్ లో వ‌చ్చే మూవీస్ అంటే అక్క‌డ ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి నెల‌కొంటుంది. ఈ నేప‌థ్యంలో... 2020 పొంగ‌ల్ సంద‌ర్భంగా కోలీవుడ్‌లో మూడు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నవంబర్‌లో రానున్న విశాల్ ‘యాక్షన్’?

కోలీవుడ్ స్టార్ విశాల్, సీనియ‌ర్‌ డైరెక్టర్ సి.సుందర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘యాక్షన్’. మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి పోలీస్ ఆఫీస‌ర్‌గా మాస్ మ‌హారాజా?

“చావు నా కళ్ళ ముందు వున్నప్పుడు నా కళ్ళలో బెరుకు ఉండకూడదు... నా ముఖంలో చిరునవ్వు ఉండాలి... నా చేయి నా మీసం మీద ఉండాలి సర్” అంటూ ‘విక్రమార్కుడు’ సినిమాలో ఏసీపీ విక్రమ్ రాథోడ్‌గా నట విశ్వరూపం చూపించాడు రవితేజ. కాగా... ఇప్పుడు మరోసారి అటువంటి పాత్రలో దర్శనమివ్వడానికి సిద్ధపడుతున్నాడట ఈ మాస్ మహారాజా.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'బెల్లంకొండ' కోసం ‘శ్రీనువైట్ల’ ఎదురుచూపులు

మొదటి నుండి భారీ బడ్జెట్ తో.. పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ కమర్షియల్ సినిమాలు తీసినా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మాత్రం పెద్దగా సక్సెస్ రాలేదని చెప్పొచ్చు. అయితే రీమేక్ చేసిన సినిమాతో మాత్రం సక్సెస్ అందుకున్నాడు. తమిళ్ లో హిట్ అయిన 'రాచ్చసన్' సినిమాకు రీమేక్ గా తెలుగులో 'రాక్షసుడు' సినిమాను తీసి ఫైనల్ గా ఒక హిట్ కొట్టాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ తో ‘దిల్’ రాజు హ్యాట్రిక్ ప్లాన్‌?

ఇటీవల విడుదలైన `గద్దలకొండ గణేష్’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఓ వైపు ఈ సినిమా స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే... మరోవైపు తన తదుపరి చిత్రంపై దృష్టి సారిస్తున్నాడు ఈ యంగ్ హీరో. డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కించ‌బోతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాక్స‌ర్‌గా దర్శనమివ్వనున్నాడు వ‌రుణ్‌. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట వ‌రుణ్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పూరీ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ..!

ఇటీవలే డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న‌ సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో విజ‌య్ సింగ‌రేణి ఉద్యోగిగా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చరణ్ ను ఈడ్చుకెళ్లిన సీన్ - బాధపడిన 'చిరు' దంపతులు

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించుచున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

గీతా ఆర్ట్స్ వెబ్ సిరీస్ లో నాగ్ హీరోయిన్..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ప్రొడక్షన్ సంస్థలలో గీతా ఆర్ట్స్ కూడా ఒకటని మనకు తెలుసు. ఈ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో సినిమాలు తీయగా.. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఆదర్శ్ బాలకృష్ణ ప్రధాన పాత్రలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ వెబ్ సిరీస్ ను రూపొందించుచున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మోహన్ లాల్ హిట్ సినిమా రైట్స్ సొంతం చేసుకున్న చెర్రీ..!

ఒక పక్కన సినిమాలు చేస్తూనే మరో పక్క ప్రొడక్షన్ లోకి కూడా అడుగుపెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి హీరోగా సైరా సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో.. భారీగా ఈ సినిమాను చెర్రీ రూపొందించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందరానుంది.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

RDX లవ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

బ్లాక్ బస్టర్ RX 100 మూవీ లో తన అందం, అభినయం తో కుర్రకారును ఉర్రూతలూగించిన క్రేజీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. రామ్ మునీశ్ సమర్పణ లో హ్యాపీ మూవీస్ బ్యానర్ పై శంకర్ భాను దర్శకత్వంలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర లో రూపొందిన RDX లవ్ మూవీ అక్టోబర్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి నిర్మాత సి .కళ్యాణ్, సహ నిర్మాత సి వి రావు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆవిరి మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్

దిల్ రాజు సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై రవి బాబు దర్శకత్వంలో రవి బాబు, నేహా చౌహాన్, భరణీ శంకర్, ముక్తార్ ఖాన్ ప్రధాన పాత్రలలో రూపొందిన థ్రిల్లర్ ఆవిరి మూవీ అక్టోబర్ నెలలో రిలీజ్ కానుంది. ఆవిరి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో మూవీ పై ఆసక్తిని కలిగించిన నిర్మాత, దర్శకుడు రవి బాబు, అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా స్పాట్ ది స్పిరిట్ అంటూ రూపొందించిన టీజర్ తో ఆవిరి మూవీ కి మరింత హైప్ తెచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కొరటాల శివ తర్వాత త్రివిక్రమ్ తోనే చిరు సినిమా..!

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరు హీరోగా తెరకెక్కిన సైరా సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'మిస్ ఇండియా తెలంగాణ'తో నితిన్..?

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా భీష్మ సినిమా చేస్తున్న సంగతి తెలసిందే కదా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను క్రిస్టమస్ పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. రష్మికా మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను... సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'అర్జున్ సురవరం' కు డేట్ దొరికేసిందంటున్న నిఖిల్..!

కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా తెలుగులో నిఖిల్ హీరోగా అర్జున్ సురవరం పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. టి.ఎన్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కొన్ని నెలల క్రితం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధమైంది. కానీ అప్పటినుండి ఇప్పటివరకు రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు. మొదట మే అన్నారు.. ఆతర్వాత మళ్ళీ మార్చారు.. ఇక ఆతర్వాత మళ్ళీ ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.

TFN Adminవాట్సాప్
Kajal Aggarwal Hollywood Movie Title Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Actress Kajal Aggarwal Latest News,Heroine Kajal Aggarwal Upcoming Movie News,Kajal Aggarwal Next Film Updates,Kaj
సినిమా వార్తలు

కాజల్ హాలీవుడ్ మూవీ టైటిల్ ది కాల్ సెంటర్ ?

టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ ఒక హాలీవుడ్ మూవీ లో నటించనున్న విషయం తెలిసిందే జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా ఇంగ్లీష్ , తెలుగు భాషలలో రూపొందనున్న మూవీ కి టైటిల్ ది కాల్ సెంటర్ గా ఫిక్స్ చేసినట్టు సమాచారం. విష్ణు మంచు నిర్మాణ సారథ్యంలో రూపొందనున్న ఈ మూవీ తెలుగు వెర్షన్ లో విష్ణు మంచు హీరోగా నటిస్తారు. ఈ రొమాంటిక్ డ్రామా లో కాజల్ ఒక కొత్త లుక్ లో కనిపిస్తారని సమాచారం.

Team TFNవాట్సాప్
సాంగ్

‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ ఇంట్రో సాంగ్‌లో త‌మ‌న్నా

ఒక‌ వైపు కథానాయికగా రాణిస్తూనే, మరోవైపు ప్ర‌త్యేక గీతాల్లోనూ సంద‌డి చేస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇప్పటికే పలు చిత్రాల్లో తన నృత్యాల‌తో మురిపించిన‌ ఈ టాలెంటెడ్ బ్యూటీ... త్వ‌ర‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనుంది.

Team TFNవాట్సాప్
Mohan Babu Coming Up With Interesting Projects,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mohan Babu Latest News,Mohan Babu Upcoming Movie News,Dialogue King Mohan Babu Next Film Updates,Mohan Babu Next
సినిమా వార్తలు

గురుశిష్యుల చిత్రాల్లో మోహన్ బాబు

2019... దిగ్గ‌జ న‌టుడు మోహన్ బాబుకు వెరీ స్పెష‌ల్ ఇయ‌ర్‌. ఎందుకంటే... దాదాపు నాలుగు దశాబ్దాల విరామం అనంతరం మళ్ళీ స్ట్ర‌యిట్‌ తమిళ పిక్చ‌ర్స్‌లో నటిస్తున్నారాయ‌న‌. అంతేకాదు... భారీ చిత్రాలుగా తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలను కూడా గురుశిష్యులే డైరెక్ట్ చేస్తుండ‌డం విశేషం.

Team TFNవాట్సాప్

షేర్