దిల్ రాజు సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై రవి బాబు దర్శకత్వంలో రవి బాబు, నేహా చౌహాన్, భరణీ శంకర్, ముక్తార్ ఖాన్ ప్రధాన పాత్రలలో రూపొందిన థ్రిల్లర్ ఆవిరి మూవీ అక్టోబర్ నెలలో రిలీజ్ కానుంది. ఆవిరి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో మూవీ పై ఆసక్తిని కలిగించిన నిర్మాత, దర్శకుడు రవి బాబు, అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా స్పాట్ ది స్పిరిట్ అంటూ రూపొందించిన టీజర్ తో ఆవిరి మూవీ కి మరింత హైప్ తెచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
28 వ తేదీ రిలీజయిన ఆవిరి మూవీ టీజర్ వీక్షించి సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్పందన తెలియజేశారు. సినీ ప్రేక్షకులు హారర్ మూవీస్ పై ఆసక్తి చూపుతారని, థ్రిల్లర్ జానర్ లో మూవీస్ రూపొందించే రవి బాబు ఆ జానర్ లో మాస్టర్ అని, టీజర్ ఆసక్తికరంగా ఉందని, దర్శకుడు రవి బాబు &టీమ్ కు ఆల్ ది బెస్ట్ అంటూ మహేష్ బాబు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబు మూవీస్ ను ఎంకరేజ్ చేయడం అభినందనీయం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: