కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా తెలుగులో నిఖిల్ హీరోగా అర్జున్ సురవరం పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. టి.ఎన్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కొన్ని నెలల క్రితం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధమైంది. కానీ అప్పటినుండి ఇప్పటివరకు రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు. మొదట మే అన్నారు.. ఆతర్వాత మళ్ళీ మార్చారు.. ఇక ఆతర్వాత మళ్ళీ ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా మళ్ళీ ఈ సినిమా తెర పైకి వచ్చింది. ఇక ఫైనల్ గా సినిమా రిలీజ్ కావడానికి సిద్దమవుతున్నట్లు నిఖిల్ అధికారికంగా తెలియజేశాడు. సైడ్.. సైడ్.. సైడ్ ప్లీజ్ డేట్ దొరికింది అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు. అయితే డేట్ మాత్రం చెప్పలేదు. అయితే డేట్ మాత్రం చెప్పలేదు. వారం రోజుల్లో ప్రకటిస్తానని చెప్పాడు.
Side Side Side please… Date Dorikesindochh #Announcement #ThisWeek #ArjunSuravaram pic.twitter.com/fWhlAAuZYq
— Nikhil Siddhartha (@actor_Nikhil) September 29, 2019
కాగా టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. బి. మధు సమర్పణలో మూవీస్ డైనమిక్స్ ఎల్ఎల్పీ &ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు. మరి అక్కడ సూపర్ హిట్ అయిన ఈసినిమా ఇక్కడ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























