గురుశిష్యుల చిత్రాల్లో మోహన్ బాబు

Mohan Babu Coming Up With Interesting Projects,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mohan Babu Latest News,Mohan Babu Upcoming Movie News,Dialogue King Mohan Babu Next Film Updates,Mohan Babu Next Project Details,#MohanBabu

2019… దిగ్గ‌జ న‌టుడు మోహన్ బాబుకు వెరీ స్పెష‌ల్ ఇయ‌ర్‌. ఎందుకంటే… దాదాపు నాలుగు దశాబ్దాల విరామం అనంతరం మళ్ళీ స్ట్ర‌యిట్‌ తమిళ పిక్చ‌ర్స్‌లో నటిస్తున్నారాయ‌న‌. అంతేకాదు… భారీ చిత్రాలుగా తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలను కూడా గురుశిష్యులే డైరెక్ట్ చేస్తుండ‌డం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం వ‌ద్ద‌ ఏడు సంవత్సరాలు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర (‘గురు’ ఫేమ్)… ప్రస్తుతం ఎయిర్ డెక్కన్ వ్య‌వ‌స్థాప‌కుడు కెప్టెన్ జి.ఆర్.గోపీనాథ్ జీవితం ఆధారంగా `సూరరై పోట్రు` అనే బ‌యోగ్రాఫిక‌ల్ ఫిల్మ్‌ని రూపొందిస్తున్నారు. ఇందులో సూర్య కథానాయకుడిగా నటిస్తుండగా… మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. క్రిస్మ‌స్‌కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక భారీ తారాగణంతో మణిరత్నం తెరకెక్కించబోతున్న న‌వ‌ల బేస్డ్ హిస్టారిక‌ల్ ఫిల్మ్‌ ‘పొన్నియిన్ సెల్వన్’లో కూడా మోహన్ బాబు ఓ ముఖ్య‌ పాత్రలో దర్శనమివ్వనున్నారు. డిసెంబ‌ర్ నుంచి పట్టాలెక్కనున్న ఈ హిస్టారికల్ డ్రామాలో… మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కు భర్తగా నటించనున్నారు మ‌న కలెక్షన్ కింగ్.

మరి… విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచే మోహన్ బాబు… ఈ రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో త‌మిళ్ ఆడియన్స్‌ను ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలి. కాగా… ఈ రెండు సినిమాలు కూడా తెలుగులోనూ అనువాద రూపంలో సంద‌డి చేయ‌నున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.