ఇటీవల విడుదలైన `గద్దలకొండ గణేష్’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఓ వైపు ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే… మరోవైపు తన తదుపరి చిత్రంపై దృష్టి సారిస్తున్నాడు ఈ యంగ్ హీరో. డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కించబోతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాక్సర్‌గా దర్శనమివ్వనున్నాడు వరుణ్. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే… తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వరుణ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… వరుణ్ హీరోగా ‘ఫిదా’, ‘ఎఫ్ 2’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్‌ను నిర్మించిన సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు… ఇప్పుడు వరుణ్‌తో ముచ్చటగా మూడోసారి జట్టుకట్టనున్నట్టు సమాచారం. అంతేకాదు… వరుణ్‌తో ‘తొలిప్రేమ’ వంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించిన వెంకీ అట్లూరి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించనున్నాడని తెలిసింది. ప్రస్తుతం నితిన్ హీరోగా ‘రంగ్ దే’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వెంకీ. అది పూర్తైన వెంటనే వరుణ్, ‘దిల్’ రాజు మూవీపై దృష్టి సారించనున్నాడట సదరు యంగ్ డైరెక్టర్. 2020 ద్వితీయార్ధంలో పట్టాలెక్కబోయే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.
మరి… ఇప్పటికే రెండు భారీ విజయాలను అందుకున్న వరుణ్, ‘దిల్’ రాజు… రాబోయే సినిమాతో హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: