మొదటి నుండి భారీ బడ్జెట్ తో.. పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ కమర్షియల్ సినిమాలు తీసినా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మాత్రం పెద్దగా సక్సెస్ రాలేదని చెప్పొచ్చు. అయితే రీమేక్ చేసిన సినిమాతో మాత్రం సక్సెస్ అందుకున్నాడు. తమిళ్ లో హిట్ అయిన ‘రాచ్చసన్’ సినిమాకు రీమేక్ గా తెలుగులో ‘రాక్షసుడు’ సినిమాను తీసి ఫైనల్ గా ఒక హిట్ కొట్టాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చాలా జాగ్రత్తగా తర్వాత ప్రాజెక్టును సెలెక్ట్ చేసుకొనేపనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో శీను వైట్ల సాయిని కలిసి ఒక కథ చెప్పాడట. ఇక కథ పూర్తిగావిన్న సాయి వెంటనే గ్రీన్ సిగ్నల్ చెప్పలేదని తెలుస్తోంది. ఆయన సమాధానం కోసమే శ్రీను వైట్ల వెయిట్ చేస్తున్నాడట.
మరి వరుస పరాజయాలకు ముందు శ్రీను వైట్లా స్టార్ డైరెక్టరే. ఆ తరువాత వరుసగా ప్లాప్స్ రావడంతో.. వాటి ప్రభావంతో -శ్రీనువైపు తిరిగి చూసే హీరోయే లేకండాపోయాడు. అయినా ప్రయత్నాలు ఆపని శీను వైట్ల -కథ విన్న బెల్లంకొండ నుంచి తీపి కబురు కోసం ఎదురు చూస్తున్నాడట. మరి శ్రీను వైట్ల కి సాయి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























