“చావు నా కళ్ళ ముందు వున్నప్పుడు నా కళ్ళలో బెరుకు ఉండకూడదు… నా ముఖంలో చిరునవ్వు ఉండాలి… నా చేయి నా మీసం మీద ఉండాలి సర్” అంటూ ‘విక్రమార్కుడు’ సినిమాలో ఏసీపీ విక్రమ్ రాథోడ్‌గా నట విశ్వరూపం చూపించాడు రవితేజ. కాగా… ఇప్పుడు మరోసారి అటువంటి పాత్రలో దర్శనమివ్వడానికి సిద్ధపడుతున్నాడట ఈ మాస్ మహారాజా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించనున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో… రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడని సమాచారం. ఇప్పటికే ‘వెంకీ’, ‘విక్రమార్కుడు’, ‘కిక్’, ‘మిరపకాయ్’, ‘పవర్’, ‘టచ్ చేసి చూడు’ వంటి చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించి సింహభాగం విజయాలు అందుకున్న రవితేజ… మరోసారి తనకి అచ్చొచ్చిన పాత్రలో ఏ స్థాయిలో రంజింపజేస్తాడో చూడాలి.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘డిస్కో రాజా’ చిత్రీకరణ దశలో ఉంది. వీఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్… క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























