కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 46

సినిమా వార్తలు

కొత్త దర్శకుడితో శ్రీవిష్ణు మూవీ

వైవిధ్య భరిత పాత్రలలో విభిన్న కథాంశాల చిత్రాలలో హీరోగా నటిస్తున్న శ్రీవిష్ణు నటించిన నీదీ నాదీ ఒకే కథ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా మూవీస్ ఘనవిజయం సాధించాయి. సెలెక్టివ్ గా మూవీస్ లో నటిస్తున్న శ్రీవిష్ణు ఇప్పుడు ఒక కొత్త దర్శకుడి మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ ఒక వినూత్న కథతో రూపొందనుంది.

Team TFNవాట్సాప్
సాంగ్

బోయ‌పాటి సినిమా కోసం బ‌రువు త‌గ్గ‌నున్న బాల‌య్య‌

‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను మరోసారి జట్టుకట్టబోతున్న సంగతి తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

న‌వంబ‌ర్ నుంచి రామ్‌, కిషోర్ తిరుమ‌ల హ్యాట్రిక్ ఫిల్మ్‌?

‘ఇస్మార్ట్ శంకర్’తో కెరీర్ బెస్ట్‌ హిట్ ను అందుకున్న ఎన‌ర్జిటిక్‌ స్టార్ రామ్... ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి విజయవంతమైన చిత్రాల‌ను తెరకెక్కించిన దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో... ఈ సినిమా చేయ‌బోతున్నాడ‌ట రామ్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

షాపింగ్ మాల్‌లో బ‌న్నీ సంద‌డి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ‘అల వైకుంఠపురములో’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

రిలీజ్ డేట్ "మీకు మాత్రమే చెప్తా "

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రొడక్షన్ హౌస్ కింగ్ ఆఫ్ ది ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై తనకు సూపర్ హిట్ మూవీ పెళ్ళి చూపులు తో హీరోగా బ్రేక్ నిచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ను టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేస్తూ షమీర్ సుల్తాన్ దర్శకత్వంలో రూపొందించిన మీకు మాత్రమే చెప్తా మూవీ నవంబర్ 1వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి సెంటిమెంట్ ఫాలో అవుతున్న అనిల్‌ రావిపూడి

సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్‌ ఆర్మీ మేజర్‌గా దర్శనమివ్వనున్న ఈ యాక్షన్ అండ్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ కోసం... మరోసారి తన సెంటిమెంట్‌ను పునరావృతం చేయనున్నాడు దర్శకుడు అనిల్.

Team TFNవాట్సాప్
సాంగ్

బోయపాటి క్లాప్ తో గోపీచంద్ 28 మూవీ ప్రారంభం

BVSN ప్రసాద్ సారథ్యం లో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై రూపొందిన ఛత్రపతి, డార్లింగ్, సాహసం, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో, తొలిప్రేమ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో ఈరోజు హైదరాబాద్ లో గోపీచంద్ 28 మూవీ షూటింగ్ ప్రారంభమయింది. సక్సెస్ ఫుల్ మూవీ సాహసం తరువాత ఆ బ్యానర్ లో హీరో గోపీచంద్ నటిస్తున్న రెండవ మూవీ.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి ‘మాస్టర్’కు 22 ఏళ్ళు

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘మాస్టర్’ ఒకటి. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరుకి జోడిగా సాక్షి శివానంద్, రోషిణి నటించగా పునీత్ ఇస్సార్, సత్యప్రకాష్, విజయ్ కుమార్, వేణుమాధవ్, శివాజీ, బండ్ల గణేష్, తిరుపతి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

Team TFNవాట్సాప్
రివ్యూ

తెలుగు సినిమా నిర్మాణ ప్రమాణాలకు మరో గ్రేట్ ఎగ్జాంపుల్ సైరా

ఇలాంటి మహత్తర, బృహత్తరమైన ప్రాజెక్ట్స్ లో ఒకటీ అరా లోపాలు కనిపించినప్పటికీ వాటిని రంధ్రాన్వేషణ దృష్టితో కాకుండా పాజిటివ్ కోణంలో చూసి అభినందించాలే కానీ ఇలాంటి అరుదైన ప్రయత్నాలను రేటింగుల రేసులోకి లాగటం సమంజసం కాదు. Sye Raa is Truly a Proud film that deserves an Unconditional Appreciation.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బెల్లంకొండ గణేష్ బాబు టాలీవుడ్ ఎంట్రీ

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ కి రంగం సిద్ధం అయింది. లక్ష్మీ నరసింహా, శంభో శివ శంభో, కందిరీగ, జబర్దస్త్, బస్ స్టాప్ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మాత బెల్లంకొండ సురేష్ భారీ బడ్జెట్ తో VV వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శీను మూవీ తో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ ను టాలీవుడ్ కు హీరో గా పరిచయం చేశారు.ఇప్పుడు తన రెండవకుమారుడు నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు ను ఎంటర్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
Chiyaan Vikram To Be Seen in 25 Different Looks,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Chiyaan Vikram Upcoming Movie News,Chiyaan Vikram Next Film Updates,Chiyaan Vikram New Movie News,Chiyaan Vikram
సినిమా వార్తలు

25 గెటప్స్ లో స్టార్ హీరో చియాన్ విక్రమ్

విభిన్న పాత్రలలో ప్రయోగాత్మక చిత్రాలలో నటించే తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ దేశం గర్వించదగ్గ గొప్పనటుడు. తమిళం తో పాటు తెలుగు లో కూడా సమాన మార్కెట్ ఉన్న హీరో విక్రమ్ తాను నటించే మూవీ లో పాత్రకు తగ్గట్టుగా శరీర ఆకృతి ని మార్చుకునే ప్రతిభావంతుడు. ఇప్పుడు తన 58 వ మూవీ కి విక్రమ్ సిద్ధమవుతున్నారు. హీరో విక్రమ్ ప్రస్తుతం 300కోట్ల భారీ బడ్జెట్ తో తమిళ, మలయాళ, హిందీ భాషలలో రూపొందుతున్న మహావీర్ కర్ణ మూవీ లో కర్ణుడు గా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ప్రతి రోజూ పండగే రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా రూపొందిన సుప్రీమ్ మూవీ ఘనవిజయం సాధించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. వారిద్దరూ జంటగా మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. మహానుభావుడు, భలే భలే మగాడివోయ్ వంటి సూపర్ హిట్ మూవీస్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2, UV క్రియేషన్స్ బ్యానర్స్ పై సాయి ధరమ్, రాశీ జంటగా పల్లెటూరి నేపథ్యం లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రతి రోజూ పండగే మూవీ రూపొందుతుంది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

రామోజీ ఫిల్మ్ సిటీలో `అఖిల్‌-4`

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంట‌గా `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని బ‌న్నీ వాస్‌, వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఎ. కోదండరామిరెడ్డి డ‌బుల్ ధ‌మాకా ‘రాక్షసుడు’, ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’కు 33 ఏళ్ళు

1986 అక్టోబర్ 2... దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎ.కోదండరామిరెడ్డి కెరీర్‌లో ప్ర‌త్యేక‌మైన‌ రోజు. ఎందుకంటే... ఇదే రోజున త‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజై మ్యూజిక‌ల్ హిట్స్‌గా నిలిచాయి. వాటిలో ఒక‌టి మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా నటించిన ‘రాక్షసుడు’ కాగా... మ‌రొక‌టి యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’.

Team TFNవాట్సాప్
Happy Days Movie Completes 12 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Happy Days Movie Updates,Happy Days Telugu Movie Latest News,Happy Days Movie Completed 12 Years,12 Years Completes Happy Da
సినిమా వార్తలు

పుష్క‌ర‌కాలం పూర్తి చేసుకున్న ‘హ్యాపీడేస్‌’

ఫీల్ గుడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ‘ఆనంద్’, ‘గోదావరి’ వంటి ఫీల్ గుడ్ మూవీస్ తెర‌కెక్కించి యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న ఈ సెన్సిబుల్ డైరెక్టర్ చేసిన తదుపరి ప్రయత్నమే ‘హ్యాపీడేస్’. కళాశాల నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కాలేజీ లైఫ్‌తో పాటు... అందులోని స్నేహాలను, ప్రేమలను తనదైన శైలిలో వెండితెరపై ఆవిష్కరించారు శేఖర్. అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై శేఖర్ కమ్ముల నిర్మించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో... వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ సిద్ధార్థ్, గాయత్రిరావు, రాహుల్, సోనియా దీప్తి, వంశీ చాగంటి, మొనాలి చౌదరి ప్రధాన పాత్రలు పోషించగా... తమన్నా…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌హాత్మ గాంధీ శ‌త‌జ‌యంతికి విడుద‌లైన ‘మనుషులు మారాలి’కి అర్ధ శ‌తాబ్దం

అలనాటి మేటి నటి శారదకు జాతీయస్థాయిలో `ఉత్తమ నటి`గా గుర్తింపునిచ్చిన‌ మలయాళ చిత్రం ‘తులాభారం’. పేదరికం వల్ల‌... పెంచే స్థోమత లేక కన్నపిల్లల్నే చంపుకున్న ఓ తల్లి కథే ఈ సినిమా. మ‌ల‌యాళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘మనుషులు మారాలి’ పేరుతో రీమేక్ చేశారు దర్శకుడు వి.మధుసూద‌నరావు. శోభన్‌బాబు, శారద జంటగా నటించిన ఈ సినిమాలో హరనాథ్, కాంచన, గుమ్మడి వెంకటేశ్వరరావు ముఖ్య భూమిక‌లు పోషించారు.

Team TFNవాట్సాప్
27 Years Completes For Venkatesh Sundarakanda Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sundarakanda Movie Updates,Sundarakanda Telugu Movie Latest News,Sundarakanda Movie Completes 27 Years,#Sund
సినిమా వార్తలు

వెంక‌టేష్ ‘సుందరకాండ’కు 27 ఏళ్ళు

విక్టరీ వెంకటేష్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో తెరకెక్కిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో ‘సుందరకాండ’ ఒకటి. తమిళ చిత్రం ‘సుందరకాండం’కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడిగా మీనా నటించగా... అపర్ణ కీలక పాత్ర పోషించింది. గొల్లపూడి మారుతీరావు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, కోట శ్రీనివాసరావు, నిర్మలమ్మ ముఖ్య భూమికలు పోషించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'భారతీయుడు2' - అజయ్ దేవగన్ అవుట్.. అనిల్ కపూర్ ఇన్..?

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 23 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'సరిలేరు నీకెవ్వరు' కామెడీ అంతకుమించి..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సంగతి కూడా తెలిసిందే. అయితే తాజా సమాచార ప్రకారం ఈ సినిమాలో కామెడీ మాత్రం ఎక్స్పెక్ట్ చేసినదానికంటే.. ఎక్కువగా ఉండబోతుందట.. ముఖ్యంగా సెకండాఫ్ లో మాత్రం ఆ డోస్ ఇంకా ఎక్కువగా ఉండబోతుందట.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దళపతి వర్సెస్ మక్కళ్‌ సెల్వన్‌

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మక్కళ్‌ సెల్వన్ విజయ సేతుపతి కూడా అతి తక్కువ కాలంలోనే.. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ఓ రేంజ్ కు వెళ్ళాడు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే.. వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ పై చూస్తే ఎలా ఉంటది. ఊహించుకుంటేనే చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా.. ఈ ఊహ నిజం కాబోతున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్