పూరీ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ..!

Vijay Deverakonda To Learn Martial-arts for Puri Jagannadh Film?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda New Movie Updates,Actor Vijay Deverakonda Next Film Updates,Hero Vijay Deverakonda Upcoming Project Details

ఇటీవలే డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న‌ సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో విజ‌య్ సింగ‌రేణి ఉద్యోగిగా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దానితోపాటు పూరితో కూడా ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఫైటర్ అనే టైటిల్ ను అనుకుంటున్నారు చిత్రయూనిట్. జనవరిలో ఈ సినిమా షూటింగ్ ను మొదలపెట్టనున్నట్టు తెలుస్తుంది. క్రాంతి మాధవ్ సినిమా అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నాడట విజయ్.

ఇదిలా ఉండగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఈ సినిమా కోసం విజయ్ మార్షల్ ఆర్ట్స్ ను నేర్చుకోనున్నాడట. అంతేకాదు దీనికోసం ఓ కోచ్ ను కూడా పూరీ నియమించనున్నాడట. మరి చూద్దాం విజయ్ కోసం కామెడీ ప్లస్ యాక్షన్ కలిపి కథను రెడీ చేస్తున్నాడట. చూద్దాం మరి విజయ్ ను పూరీ ఎలా చూపిస్తాడో..!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.