
ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 34


తక్కువ నిడివితో వస్తున్న 'ఆవిరి'

S5 No Exit మూవీ షూటింగ్ ప్రారంభం

అది 'తేరి' రీమేక్ కాదండి బాబు..!
అన్వేషణ మూవీ సీక్వెల్ అన్వేషణ 2

'మెగా ఫ్యామిలీ' సినిమా - క్లారిటీ ఇచ్చిన వర్మ
ఐరన్ లేడీ మూవీ విశేషాలు
దర్బార్ మూవీ మారిన రిలీజ్ డేట్
చిరు, త్రివిక్రమ్... ఓ కంప్లీట్ ఎంటర్‌టైనర్
`గుడ్ లక్ సఖి` ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

ఆ సినిమా అసంపూర్ణం - డబ్బుల కోసమే ఇదంతా..!
రామ్ చరణ్‌తో విక్రమ్ కె.కుమార్?
`డిస్కోరాజా` టీజర్ అప్‌డేట్
'తోలుబొమ్మలాట' ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
‘ఉల్లాసం’ చిత్రానికి రీమేక్ 22ఏళ్ల తర్వాత

'118' కాంబినేషన్ రిపీట్
వరుస పరాజయాల తర్వాత '118' సినిమాతో మంచి విజయం అందుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. ఇప్పుడు 'ఎంత మంచి వాడవురా' అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. సతీష్ వేగేష్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఆఖరి షెడ్యూల్‌ని కేరళలోని మున్నార్ తదితర సుందరమైన ప్రదేశాల్లో ఈ నెల 31 నుంచి నవంబర్ 10 వరకూ షూట్ చేయనున్నారు. అక్కడ రెండు పాటలు, కీలక సన్నివేశాలు, పాటలు చిత్రీకరిస్తారు.
నా తొలి ప్రాధాన్యత రాజకీయాలకే- విశ్వనటభారతి విజయశాంతి
తమ అద్భుత, అభినయ చాతుర్యంతో, సామర్థ్యంతో తెలుగు తెరను ఏలిన కథానాయికలు ఎందరో ఉన్నారు. కంటి చూపుతో, కొంటె నవ్వుతో ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్లకు కొదవలేదు. అయితే కథానాయికగా ఒక కమాండింగ్ పొజిషన్ను ఎంజాయ్ చేసిన హీరోయిన్లు చాలా తక్కువ. పురుషాధిక్య రంగమైన చిత్ర పరిశ్రమలో అందచందాల ఆరబోతకు మాత్రమే పరిమితమయ్యే సెట్ ప్రాపర్టీ లాగా కాకుండా అన్నీ తానై కథను నడిపించి రెండున్నర దశాబ్దాల అత్యున్నత వైభవాన్ని చవి చూసిన కథానాయిక ఒకరున్నారు. బాక్సాఫీస్ హీరోలకు దీటైన స్టార్ డమ్ ను, ఇమేజ్ ని, క్రేజ్ ను సొంతం చేసుకొని హీరోయిన్ పాత్రల నేచర్ ను,స్టేచర్ ను, స్టేటస్ ను మార్చేసిన ఆ శిఖరాగ్ర స్ధాయి కథానాయిక…

తక్కువ నిడివితో వస్తున్న 'ఆవిరి'
యదార్ధ సంఘటన ఆధారంగా రవిబాబు దర్శకత్వంలో 'ఆవిరి' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లతో సినిమాపై అంచనాలు పెంచేసాడు రవిబాబు. 'స్పాట్ స్పిరిట్' అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రన్ టైమ్ లాక్ అయినట్టు తెలుస్తుంది. కేవలం 112 నిమిషాల 37 సెకండ్లు మాత్రమే ఈ సినిమా నిడివి ఉంది. అంటే కేవలం 2 గంటలకంటే తక్కువ మాత్రమే ఉంటుందన్నమాట. మరి హార్రర్ సినిమాలు నిడివి ఎంత తక్కువ ఉంటే అంతే మంచిది. అది దృష్టిలో పెట్టుకొనే రవిబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నాడు.

S5 No Exit మూవీ షూటింగ్ ప్రారంభం
సాగ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సన్ని కోమలపాటి దర్శకత్వం లో తారక రత్న, ప్రిన్స్, అవంతిక, రుతుజ సావంత్ ప్రధాన పాత్రలలో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతున్న S5 No Exit మూవీ షూటింగ్ ఈ రోజు ప్రారంభమయింది. సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ క్లాప్ తో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయింది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా తారక రత్న ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ లో అలీ ఫస్ట్ లుక్
టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నిజ జీవిత రాజకీయ నాయకుల పాత్రలతో కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. KRKR మూవీ లోని ఒక్కొక్క క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తూ RGV ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు. KRKR మూవీ లోని క్యారెక్టర్స్ కు దగ్గిర పోలికలున్న వ్యక్తులను ఎంపిక చేసుకొని RGV మూవీ ని తెరకెక్కిస్తున్నారు. మూడు సాంగ్స్ ను రిలీజ్ చేసి ప్రేక్షకులలో మూవీ పై ఆసక్తి కలిగేలా చేశారు.

అది 'తేరి' రీమేక్ కాదండి బాబు..!
మాస్ మహారాజా రవితేజ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మొన్న దీపావళి పండుగ సందర్భంగా ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు.
అన్వేషణ మూవీ సీక్వెల్ అన్వేషణ 2
దర్శకుడు వంశీ దర్శకత్వంలో కార్తీక్, భానుప్రియ జంటగా అటవీ నేపథ్యం లో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ అన్వేషణ మూవీ 1985 సంవత్సరం మే నెలలో రిలీజయి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులకు వీనుల విందు చేశాయి . ఇప్పుడు అన్వేషణ మూవీ కి సీక్వెల్ వంశీ రూపొందిస్తారని సమాచారం.

'మెగా ఫ్యామిలీ' సినిమా - క్లారిటీ ఇచ్చిన వర్మ
రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా ఓ సంచలనమే.. రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతో కన్నా... వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తాడు. సినిమా టైటిల్ తోనే సినిమాకు ఎక్కడా లేని హైప్ ను తీసుకొస్తాడు వర్మ. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అయితే ఏంటి, ఇప్పుడు వస్తున్న 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అయితే ఏంటి సినిమా రిజల్ట్ పక్కన పెడితే టైటిల్ తోనే వివాదాలు సృష్టిస్తాడు వర్మ. ఇక రీసెంట్ గానే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసాడు. ఈ సినిమా ట్రైలర్ ను చూస్తే కొంతమంది రాజకీయ నాయకులను పరోక్షంగా టార్గెట్ చేసినట్టే కనిపిస్తుంది.
ఐరన్ లేడీ మూవీ విశేషాలు
లెజండరీ యాక్ట్రెస్ , దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా పలు మూవీస్ కోలీవుడ్ లో రూపొందనున్న విషయం తెలిసిందే. AL విజయ్ దర్శకత్వంలో కంగన రనౌత్ జయలలిత పాత్రలో రూపొందనున్న తలైవి , ప్రియా దర్శిని దర్శకత్వంలో నిత్య మీనన్ జయలలిత గా ఐరన్ లేడీ మూవీస్ రూపొందనున్నాయి. డైనమిక్ లీడర్ జయలలిత పై ఎన్ని మూవీస్ రూపొందినా జయలలితను ఆరాధ్య దేవతగా, అమ్మగా కొలుచుకొనే ప్రజలు ఆదరిస్తారన్నది నిజం.
దర్బార్ మూవీ మారిన రిలీజ్ డేట్
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా AR మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన మాస్ ఎంటర్ టైనర్ దర్బార్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు దర్బార్ రిలీజ్ డేట్ మారింది. సంక్రాంతి బరిలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల .. వైకుంఠపురము లో, కళ్యాణ్ రామ్ ఎంతమంచివాడవురా మూవీస్ ఉన్నాయి. రజనీకాంత్, నయనతార జంటగా నటించిన దర్బార్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.
చిరు, త్రివిక్రమ్... ఓ కంప్లీట్ ఎంటర్‌టైనర్
రీసెంట్ గా `సైరా నరసింహారెడ్డి` అంటూ అలరించిన మెగాస్టార్ చిరంజీవి... ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. అదయ్యాక ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో తన 153వ చిత్రం చేయబోతున్నట్లు కొన్నాళ్ళ క్రితం చెప్పుకొచ్చారు చిరు.
`గుడ్ లక్ సఖి` ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
`మహానటి` తరువాత నాయికా ప్రాధాన్య చిత్రాలకు చిరునామాగా మారింది కీర్తి సురేష్. ఒకవైపు `మిస్ ఇండియా`తో బిజీగా ఉన్న కీర్తి... మరో వైపు `గుడ్ లక్ సఖి`లో నటిస్తోంది. `మిస్ ఇండియా`లో మోడ్రన్ లుక్‌లో దర్శనమివ్వనుండగా... `గుడ్ లక్ సఖి`లో బంజారా యువతిగా కనిపించనున్నట్లు సమాచారం.
సరిలేరు నీకెవ్వరు మూవీ పోస్టర్ రికార్డ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్ విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, ఆది పినిశెట్టి ముఖ్యపాత్రలలో నటిస్తున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శరవేగంగా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు మూవీ మరో షూటింగ్ షెడ్యూల్ తో చిత్రీకరణ కంప్లీట్ చేసుకోనుంది.

ఆ సినిమా అసంపూర్ణం - డబ్బుల కోసమే ఇదంతా..!
శివకుమార్ దర్శకత్వంలో రానా కథానాయకుడిగా 1945 సినిమా తెరకెక్కుతున్నట్టు గతంలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 2017లో 1945 పేరుతో ఓ పీరియాడిక్ పేట్రియాటిక్ సినిమాను ప్రకటించాడు రానా. కె ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజరంజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రానా ప్రధాన పాత్రలో.. రానా సరసన రెజీనా నటిస్తున్న ఈ సినిమా కొంతకాలం షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. దాదాపు ఏడాది నుండి ఈ సినిమా గురించి ఎలాంటి వార్త రాలేదు. అయితే అనూహ్యంగా దీపావళి సందర్భంగా ‘1945’ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆదివారం సోషల్‌మీడియా వేదికగా మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.
టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న వాణీ విశ్వనాథ్ తనయ
80, 90ల్లో గ్లామర్ హీరోయిన్‌గా వెలుగొందారు వాణీ విశ్వనాథ్. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ తనదైన ముద్రవేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... ఆమధ్య `జయ జానకి నాయక`తో తెలుగునాట చాన్నాళ్ళ తరువాత రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే... ఇప్పుడు వాణి కూతురు వర్ష విశ్వనాథ్ నాయికగా తొలి అడుగులు వేస్తోంది.
రామ్ చరణ్‌తో విక్రమ్ కె.కుమార్?
`ఇష్టం`తో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన విక్రమ్ కె.కుమార్... `ఇష్క్`తో తెలుగునాట తొలి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఆ తరువాత వచ్చిన `మనం`తో దర్శకుడిగా ఎనలేని గుర్తింపుని దక్కించుకున్నాడు. `మనం` అనంతరం మరో మూడు సినిమాలు చేసినా... ఆ స్థాయి విజయాన్నైతే అందుకోలేకపోయాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. అయినప్పటికీ... విక్రమ్‌కి ఓ క్రేజీ ప్రాజెక్ట్ దక్కిందని సమాచారం.
`డిస్కోరాజా` టీజర్ అప్‌డేట్
మాస్ మహారాజా రవితేజ పిరియాడికల్ బాట పట్టాడు. 80ల నాటి వాతావరణంలో డిస్కో డాన్సర్‌గా సందడి చేయనున్నాడు. అంతేకాదు... తండ్రీకొడుకులుగా రెండు విభిన్న పాత్రలో మురిపించబోతున్నాడు కూడా. `డిస్కోరాజా` పేరుతో తెరకెక్కుతున్న ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ కి వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా... ఎస్.ఆర్.టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నాడు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది.
'తోలుబొమ్మలాట' ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో విశ్వనాథ్ మాగంటి దర్శకుని పరిచయమవుతూ వస్తున్న సినిమా 'తోలుబొమ్మలాట'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే నెలలో రిలీజ్ చేసే ప్లాన్లో వున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ట్రయిలర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. నవంబర్ 1వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్.
‘ఉల్లాసం’ చిత్రానికి రీమేక్ 22ఏళ్ల తర్వాత
గతంలో ఒకే బంగారం సినిమా టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ మహానటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. మహానటిలో జెమిని గణేశన్ పాత్రని తనదైన శైలిలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు.
'లూసిఫర్' తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్నా కానీ..!
ఒక పక్కన సినిమాలు చేస్తూనే మరో పక్క ప్రొడక్షన్ లోకి కూడా అడుగుపెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటీకే రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి హీరోగా సైరా సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో.. భారీగా ఈ సినిమాను చెర్రీ రూపొందించాడు. అంతేకాదు ముందు ముందు చిరు సినిమాలకు కూడా చెర్రీనే నిర్మాతగా ఉండాలని అనుకుంటున్నాడట.