ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 35

సెన్సార్ పూర్తిచేసుకున్న 'మీకు మాత్రమే చెప్తా'
ఫోక్ జానర్ లో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ
#చిరు152 నక్సలైట్ గా రామ్ చరణ్..!
కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ ?

నిశ్శబ్దం టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

త్వరలో సెట్స్ పైకి బన్నీ-సుకుమార్ మూవీ..!
హీరో కార్తీ ఖైదీ మూవీ సీక్వెల్ ఖైదీ 2

దీపావళికి టాలీవుడ్ ట్రీట్
దర్బార్ మూవీ కొత్త పోస్టర్
నవంబర్ నుంచి ప్రభాస్-20 కొత్త షెడ్యూల్
బన్నీ చిత్రంలో విజయ్ సేతుపతి?
రవితేజ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్?
'అశ్వద్ధామ' వచ్చేది అప్పుడే
'నర్తనశాల' సినిమాతో పరాజయంపాలైన కూడా యంగ్ హీరో నాగశౌర్య మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఒక వైపున ఇతర బ్యానర్లలో సినిమాలు చేస్తూనే, మరో వైపున తన సొంత బ్యానర్లోను నాగశౌర్య సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన బ్యానర్ లో 'అశ్వద్ధామ' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

సెన్సార్ పూర్తిచేసుకున్న 'మీకు మాత్రమే చెప్తా'
విజయ్ దేవరకొండ నిర్మాతగా.. తరుణ్ భాస్కర్ హీరోగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై 'మీకు మాత్రమే చెప్తా' అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా నవంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫోక్ జానర్ లో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ
తొలి ప్రేమ, బద్రి, ఖుషి , జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన మేనరిజం, డైలాగ్ డెలివరీ తో అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రేక్షకులకు, అభిమానులకు విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అజ్ఞాత వాసి మూవీ తరువాత సినిమాలకు దూరమై ప్రజా సేవ కై జనసేన పార్టీ అధ్యక్షుడు గా పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ మారారు. ప్రేక్షక, అభిమానుల కోరిక పై సినిమాలలో రీ ఎంట్రీ కై పవన్ కళ్యాణ్ సుముఖంగా ఉన్నారని సమాచారం.
#చిరు152 నక్సలైట్ గా రామ్ చరణ్..!
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన 'సైరా' సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలెక్షన్ల విషయంలో కూడా ఈ సినిమా పలు రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత చిరు కొరటాలతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
రామ్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
మొత్తానికి వరుస ప్లాప్స్ తో కాస్త ఫామ్ తగ్గిన రామ్ కు పూరి ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ ఇచ్చి ఫామ్ లోకి తెచ్చాడు. ఇక ఈసారి కథ ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఫైనల్ గా మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తడం' సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
విజయ్ దేవరకొండకు జోడీగా జాన్వీ.. పూరీ మాస్టర్ ప్లాన్
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో వున్న ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత పూరీ-విజయ్ కంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఫైటర్ అనే టైటిల్ ను ఈ సినిమాకు పెట్టనున్నట్టు తెలుస్తుంది.
కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ ?
లండన్ నుండి నుండి హైదరాబాద్ చేరుకొన్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన అప్ కమింగ్ మూవీస్ ఫైనలైజ్ పనిలో స్క్రిప్ట్స్ వింటూ బిజీగా ఉన్నారు. దేశ వ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీస్ కై మొగ్గు చూపుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం UV క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా 'జాన్' మూవీ లో నటిస్తున్నారు. త్వరలోనే ఆ మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ మూవీ 2020 సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ కానుంది.

నిశ్శబ్దం టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు లో నిశ్శబ్ధం టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. నిన్న దీపావళి సందర్భంగా ప్రీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇంట్రస్టింగ్ థీమ్ మ్యూజిక్ తో పాటు బ్యూటిఫుల్ విజువల్స్ ఒక్కొక్కరి క్యారెక్టర్స్ ను చూపించిన విధానం బావుంది. ప్రీ టీజర్ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంది.

త్వరలో సెట్స్ పైకి బన్నీ-సుకుమార్ మూవీ..!
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో 'అల వైకుంఠపురములో' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో... ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్స్ ను.. పాటలను రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా’, 'రాములో రాములా' పాటలను రిలీజ్ చేశారు.
హీరో కార్తీ ఖైదీ మూవీ సీక్వెల్ ఖైదీ 2
డ్రీమ్ వారియర్స్ బ్యానర్ పై కార్తీ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఖైదీ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఖైదీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 25 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించాయి. 60 రాత్రులలో షూటింగ్ జరుపుకున్న ఖైదీ మూవీ ప్రేక్షకుల, క్రిటిక్స్ ప్రశంసలు పొందింది. పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ రోల్ లో కార్తీ అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసి ప్రేక్షకులను, తన అభిమానులను ఆకట్టుకున్నారు.

దీపావళికి టాలీవుడ్ ట్రీట్
నిన్న దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ పెద్ద ట్రీటే ఇచ్చింది. పలు సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు, ఫస్ట్ లుక్ లు, ట్రయిలర్ లు రిలీజ్ చేశారు. ఇక ఆ అప్ డేట్స్ ఏంటో ఒక లుక్కేద్దాం..
దర్బార్ మూవీ కొత్త పోస్టర్
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై AR మురుగదాస్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ దర్బార్ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన దర్బార్ మూవీ లో నయనతార కథానాయిక. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. నివేత థామస్ , ప్రతీక్ బబ్బర్, యోగి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
మోస్ట్ వ్యూడ్ సౌత్ ఇండియన్ సాంగ్‌గా `రాములో రాములా`
`అల వైకుంఠపురములో`... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, సినిమా విడుదలకి ఇంకా సమయమున్నా చిత్ర యూనిట్ అప్పుడే ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టింది. పాటలతో తమ చిత్రంపై అటెన్షన్ క్రియేట్ చేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ని మేలిమలుపు తిప్పిన `ఖైదీ`కి 36 ఏళ్ళు
నాలుగు దశాబ్దాల మెగాస్టార్ చిరంజీవి నటనాప్రస్థానంలో ఎన్నో బ్లాక్‌బస్టర్స్, మరెన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. ఇక ఇండస్ట్రీ హిట్స్ సంగతి సరేసరి. అయితే, కథానాయకుడిగా చిరు దశను, దిశను మేలిమలుపు తిప్పిన చిత్రం మాత్రం ఒకటుంది. అదే... `ఖైదీ`. అంతకుముందు ఈ కొణిదెల `కొదమసింహం` నటించిన అరవై చిత్రాలు ఒకెత్తు అయితే, `ఖైదీ` మరో ఎత్తు. పగ, ప్రతీకారాలతో రగిలిపోయే సూర్యం పాత్రలో సూర్యుడిలా వెలిగిపోయారు ఈ నటశిఖరం. ఆపై తెలుగువారి గుండెల్లో అభిమానపాత్రుడైన `ఖైదీ`గా స్థిరపడిపోయారు. మొత్తమ్మీద... `ఖైదీ`కి ముందు, `ఖైదీ`కి తరువాత అన్నంతగా చిరు కెరీర్‌పై ప్రభావం చూపింది ఈ…
కొరటాల దర్శకత్వంలో చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్?
గత ఏడాది `రంగస్థలం` రూపంలో సంచలన విజయం అందుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. అయితే, ఆ తరువాత వచ్చిన `వినయ విధేయ రామ` నిరాశపరిచినా... ఆరంభ వసూళ్ళ పరంగా చరణ్ స్టామినాని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం దర్శకధీరుడు యస్.యస్. రాజమౌళి రూపొందిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`లో... యంగ్ టైగర్ యన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు ఈ కొణిదెల వారి రెండో తరం కథానాయకుడు.
నవంబర్ నుంచి ప్రభాస్-20 కొత్త షెడ్యూల్
దాదాపు దశాబ్దం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఓ ప్రేమకథా చిత్రం వస్తోంది. అయితే.. రెగ్యులర్ లవ్ స్టోరీస్‌కి భిన్నంగా పిరియాడికల్ టచ్‌తో ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు ప్రభాస్. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నాయికగా నటిస్తుండగా.. `జిల్` ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పటికే కొంత మేర చిత్రీకరణ పూర్తిచేసుకుంది.
బన్నీ చిత్రంలో విజయ్ సేతుపతి?
వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి. కేవలం కథానాయకుడి పాత్రలకే పరిమితం కాకుండా పలు విలక్షణ భూమికల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నాడు విజయ్. కాగా, ఇటీవల మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా నరసింహారెడ్డి`తో తెలుగునాట గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సేతుపతి... ప్రస్తుతం చిరు మేనల్లుడు, సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ ఫిల్మ్ `ఉప్పెన`లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు... మరో మెగా కాంపౌండ్ హీరోతోనూ విజయ్ సేతుపతి కలసి నటించబోతున్నట్లు సమాచారం.
`ఆర్ ఆర్ ఆర్`, `లూసిఫర్`, `మెగాస్టార్ 152`పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే మరోవైపు భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతగానూ రాణిస్తున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఈ ఏడాది `వినయ విధేయ రామ`తో హీరోగానూ, `సైరా నరసింహారెడ్డి`తో ప్రొడ్యూసర్‌గానూ రెండు విభిన్న ప్రయత్నాలతో పలకరించాడు ఈ టాలెంటెడ్ స్టార్. అంతేకాదు... ఒకవైపు `ఆర్ ఆర్ ఆర్` వంటి క్రేజీ మల్టీస్టారర్‌లో నటిస్తూనే, మరోవైపు తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అలాగే మలయాళ బ్లాక్‌బస్టర్ `లూసిఫర్` రీమేక్ రైట్స్ సొంతం చేసుకుని చిరుతోనే ఆ సినిమాని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు. కాగా.... ఇటీవల ఈ మూడు సినిమాల(`ఆర్ ఆర్ ఆర్`…
రవితేజ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్?
`డాన్ శీను`, `బలుపు` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత బి. మధు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇందులో రవితేజ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. అతనికి జోడీగా శ్రుతి హాసన్ నటించనుందని టాక్. కాగా... ఈ సినిమాకి `క్రాక్` అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం. కథానుసారం ఈ టైటిల్ అయితేనే యాప్ట్‌గా ఉంటుందని యూనిట్ భావిస్తోందట. త్వరలోనే టైటిల్‌కి సంబంధించి క్లారిటీ వచ్చే…
దర్శకరత్న దాసరి 100వ చిత్రం `లంకేశ్వరుడు`కి 30 ఏళ్ళు
దర్శకరత్న దాసరి నారాయణరావు... భారతీయ చిత్ర పరిశ్రమపై చెరగని సంతకం. అత్యధిక చిత్రాలను రూపొందించిన దర్శకుడిగా అనితరసాధ్యమైన రికార్డును తన సొంతం చేసుకున్నారు దాసరి. మొత్తంగా 151 సినిమాలను తెరకెక్కించి... ఆల్ టైమ్ సెన్సేషన్ క్రియేట్ చేశారాయన. అలాంటి దాసరి కెరీర్‌లో 100వ చిత్రంగా `లంకేశ్వరుడు`కి ప్రత్యేక స్థానముంది.