ఒక పక్కన సినిమాలు చేస్తూనే మరో పక్క ప్రొడక్షన్ లోకి కూడా అడుగుపెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటీకే రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి హీరోగా సైరా సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో.. భారీగా ఈ సినిమాను చెర్రీ రూపొందించాడు. అంతేకాదు ముందు ముందు చిరు సినిమాలకు కూడా చెర్రీనే నిర్మాతగా ఉండాలని అనుకుంటున్నాడట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో ఈ ఏడాది మార్చిలో వచ్చిన ‘లూసిఫర్’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రైట్స్ రామ్ చరణ్ సొంతం చేసుకొని.. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చరణ్ ఈ సినిమాను నిర్మించనున్న టాక్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ రీమేక్ ను కూడా చిరంజీవితోనే చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.
ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ ‘లూసిఫర్’ రీమేక్ గురించిన క్లారిటీ కూడా ఇచ్చేశాడు. “మలయాళంలో మోహన్ లాల్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ రైట్స్ ను నేను తీసుకున్న మాట నిజమే. అయితే ఈ సినిమాను ఎవరితో చేయాలి? దర్శకుడిగా ఎవరైతే కరెక్ట్? అనే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఈ విషయాల్లో స్పష్టత వస్తే తప్పకుండా తెలియజేస్తాను” అని చెప్పాడు. మరి చిరుతో ఈ సినిమా తీస్తాడా? లేదా? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: