చిరు, త్రివిక్ర‌మ్‌… ఓ కంప్లీట్ ఎంట‌ర్‌టైన‌ర్‌

Trivikram To Direct Megastar Once Again,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Director Trivikram Next Movie with Megastar,Megastar Chiranjeevi New Movie Details,Trivikram Future Projects

రీసెంట్ గా `సైరా న‌ర‌సింహారెడ్డి` అంటూ అల‌రించిన మెగాస్టార్ చిరంజీవి… ప్ర‌స్తుతం స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. అద‌య్యాక ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైరెక్ష‌న్‌లో త‌న 153వ చిత్రం చేయ‌బోతున్న‌ట్లు కొన్నాళ్ళ క్రితం చెప్పుకొచ్చారు చిరు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే… చిరు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రాబోతున్న సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ట‌. ఇప్ప‌టికే స్టోరీ లైన్ చెప్పి చిరుని ఇంప్రెస్ చేసిన త్రివిక్ర‌మ్‌… `అల వైకుంఠ‌పుర‌ములో` రిలీజ్ త‌రువాత ఫుల్ స్క్రిప్ట్‌పై ఫోక‌స్ పెట్ట‌నున్నాడ‌ట‌. కామెడీ టైమింగ్‌లో చిరుకి తిరుగులేద‌ని ఇప్ప‌టికే ప‌లు చిత్రాల్లో రుజువైంది. ఈ నేప‌థ్యంలో… చాన్నాళ్ళ త‌రువాత చేయ‌నున్న ఈ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ తోనూ చిరు అభిమానుల‌ను మురిపిస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. త్వ‌ర‌లోనే చిరు, త్రివిక్ర‌మ్ కాంబో మూవీకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.

అన్న‌ట్టు… చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన `జై చిరంజీవ‌`కి త్రివిక్ర‌మ్ సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చిన సంగ‌తి తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =