`డిస్కోరాజా` టీజ‌ర్ అప్‌డేట్‌

An Interesting Update On Ravi Teja Disco Raja Teaser,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ravi Teja Disco Raja Teaser Update,Disco Raja Movie Interesting Update,Disco Raja Movie Teaser

మాస్ మ‌హారాజా ర‌వితేజ పిరియాడిక‌ల్ బాట ప‌ట్టాడు. 80ల నాటి వాతావ‌ర‌ణంలో డిస్కో డాన్స‌ర్‌గా సంద‌డి చేయ‌నున్నాడు. అంతేకాదు… తండ్రీకొడుకులుగా రెండు విభిన్న పాత్ర‌లో మురిపించ‌బోతున్నాడు కూడా. `డిస్కోరాజా` పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ కి వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా… ఎస్‌.ఆర్‌.టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌… ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… ఇటీవ‌ల `నువ్వు నాతో ఏమ‌న్నావో` అనే ఫ‌స్ట్ సింగిల్‌తో ఇంప్రెస్ చేసిన `డిస్కోరాజా` టీమ్‌… ఇప్పుడు టీజ‌ర్‌తో ప‌ల‌క‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం… న‌వంబ‌ర్ ప్ర‌థ‌మార్ధంలో ఈ టీజ‌ర్‌ని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని తెలిసింది. అంతేకాదు…`డిస్కోరాజా` పాత్ర‌ను హైలైట్ చేస్తూ తీర్చిదిద్దిన‌ ఈ టీజ‌ర్‌లో మ‌రో పాత్ర‌ని మాత్రం హైడ్ చేస్తున్నార‌ని టాక్. త్వ‌ర‌లోనే టీజ‌ర్ విడుద‌ల తేదిపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ర‌వితేజ‌కి జోడీగా పాయ‌ల్ రాజ్‌పుత్, న‌భా న‌టేష్ న‌టిస్తున్న `డిస్కోరాజా`కి థ‌మ‌న్ సంగీత‌మందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.