`మహానటి` తరువాత నాయికా ప్రాధాన్య చిత్రాలకు చిరునామాగా మారింది కీర్తి సురేష్. ఒకవైపు `మిస్ ఇండియా`తో బిజీగా ఉన్న కీర్తి… మరో వైపు `గుడ్ లక్ సఖి`లో నటిస్తోంది. `మిస్ ఇండియా`లో మోడ్రన్ లుక్‌లో దర్శనమివ్వనుండగా… `గుడ్ లక్ సఖి`లో బంజారా యువతిగా కనిపించనున్నట్లు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓ గ్రామీణ యువతి షూటింగ్‌లో తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఎలా కష్టపడిందనే కథాంశంతో `గుడ్ లక్ సఖి` తెరకెక్కుతోంది.
నగేష్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఇంకో 25 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. కీర్తి మేకప్ లేకుండా నటిస్తున్న ఈ సినిమాలో నాటకాలు వేసే కంపెనీలో పనిచేసే యువకుడిగా ఆది పినిశెట్టి నటిస్తుండగా, జగపతి బాబు కోచ్ పాత్రలో దర్శనమివ్వనున్నాడు.
మరి… ఈ వైవిధ్యభరితమైన చిత్రంతో కీర్తి మరో మెమరబుల్ హిట్ తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























