80, 90ల్లో గ్లామర్ హీరోయిన్గా వెలుగొందారు వాణీ విశ్వనాథ్. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ తనదైన ముద్రవేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఆమధ్య `జయ జానకి నాయక`తో తెలుగునాట చాన్నాళ్ళ తరువాత రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే… ఇప్పుడు వాణి కూతురు వర్ష విశ్వనాథ్ నాయికగా తొలి అడుగులు వేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… రమేష్ – గోపి దర్శకత్వంలో సిరి మూవీస్ సంస్థ ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా నటిస్తోంది వర్ష. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి రానుందని సమాచారం. మరి… వాణీ విశ్వనాథ్ లాగే వర్ష కూడా సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























