తక్కువ నిడివితో వస్తున్న ‘ఆవిరి’

Aaviri Movie To Have Less Run Time,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Aaviri Movie Run Time,Aaviri Telugu Movie Run Time,Aaviri Movie Updates,Aaviri Movie Latest News

యదార్ధ సంఘటన ఆధారంగా రవిబాబు దర్శకత్వంలో ‘ఆవిరి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లతో సినిమాపై అంచనాలు పెంచేసాడు రవిబాబు. ‘స్పాట్ స్పిరిట్’ అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రన్ టైమ్ లాక్ అయినట్టు తెలుస్తుంది. కేవలం 112 నిమిషాల 37 సెకండ్లు మాత్రమే ఈ సినిమా నిడివి ఉంది. అంటే కేవలం 2 గంటలకంటే తక్కువ మాత్రమే ఉంటుందన్నమాట. మరి హార్రర్ సినిమాలు నిడివి ఎంత తక్కువ ఉంటే అంతే మంచిది. అది దృష్టిలో పెట్టుకొనే రవిబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో ర‌విబాబుతో పాటు నేహా చౌహ‌న్, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్, ముక్త‌ర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. దిల్ రాజు త‌న సొంత బేన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్ మీదుగా చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 1న విడుదల చేయనున్నారు.

గతంలో లడ్డు బాబు, అవును 2, అదుగో సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో…. ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలి అని చూస్తున్నాడు రవిబాబు. మరి చూద్దాం ‘ఆవిరి‘ సినిమా రవిబాబుకు ఎంత సక్సెస్ తెచ్చిపెడుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =