ఆ సినిమా అసంపూర్ణం – డబ్బుల కోసమే ఇదంతా..!

Rana Daggubati Opens Up About 1945 Movie,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Actor Rana Daggubati About 1945 Movie,Rana Daggubati 1945 Movie Details,Rana Daggubati New Movie Updates

శివకుమార్‌ దర్శకత్వంలో రానా కథానాయకుడిగా 1945 సినిమా తెరకెక్కుతున్నట్టు గతంలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 2017లో 1945 పేరుతో ఓ పీరియాడిక్‌ పేట్రియాటిక్‌ సినిమాను ప్రకటించాడు రానా. కె ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజరంజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రానా ప్రధాన పాత్రలో.. రానా సరసన రెజీనా నటిస్తున్న ఈ సినిమా కొంతకాలం షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. దాదాపు ఏడాది నుండి ఈ సినిమా గురించి ఎలాంటి వార్త రాలేదు. అయితే అనూహ్యంగా దీపావళి సందర్భంగా ‘1945’ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆదివారం సోషల్‌మీడియా వేదికగా మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పై రానా స్పందించి ‘సినిమాను నిర్మించే విషయంలో నిర్మాత విఫలమయ్యాడు. దాంతో ఈ సినిమా అసంపూర్ణంగానే ఉంది. సంవత్సరం నుంచి నేను వాళ్లను కలవలేదు. పోస్టర్‌ను విడుదల చేయడమనేది డబ్బులు సంపాదన కోసం చేసిన మోసపు ఆలోచనలా అనిపిస్తోంది. దయచేసి దీనిని ప్రోత్సహించకండి’ అని రానా పేర్కొన్నారు. అంతేకాదు మా దితెలుగుఫిలింనగర్ ప్రతినిధి కూడా నిర్మాత సురేష్ బాబు కు చేసి అసలు విషయం అడుగగా.. అది నిజమేనని.. ఆ సినిమా ఎప్పుడో ఆగిపోయిందని.. దీనిపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని తెలిపారు.

ఇక రానా ట్వీట్ పై చిత్ర నిర్మాత అయిన రాజరాజన్ కూడా స్పందించి… సినిమా సంపుర్ణమా, అసంపుర్ణమా అన్నది దర్శకుడు, ప్రేక్షకులు నిర్ణయిస్తారు. కొన్ని కోట్లు పెట్టి సినిమాని తీశానని, అసంపుర్ణమైన సినిమాని ఎవరు విడుదల చేయరని రానా ట్వీట్ కు రిప్లై ఇచ్చాడు.

మరి దీనిపై క్లారిటీ వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.