‘118’ కాంబినేషన్ రిపీట్

118 Combination To Repeat Again,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,118 Movie Combination Repeat Again,118 Combination Upcoming Movie,Combination Telugu Movie with Repetitions

వరుస పరాజయాల తర్వాత ‘118’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. ఇప్పుడు ‘ఎంత మంచి వాడవురా’ అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. సతీష్ వేగేష్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఆఖరి షెడ్యూల్‌ని కేరళలోని మున్నార్‌ తదితర సుందరమైన ప్రదేశాల్లో ఈ నెల 31 నుంచి నవంబర్‌ 10 వరకూ షూట్‌ చేయనున్నారు. అక్కడ రెండు పాటలు, కీలక సన్నివేశాలు, పాటలు చిత్రీకరిస్తారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టాడు కళ్యాణ్ రామ్. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ `118` తో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరొకసారి పట్టాలెక్కబోతోంది.

ఈ సందర్భంగా నిర్మాత మ‌హేశ్ కోనేరు మాట్లాడుతూ.. విజయ్ నటించిన “విజిల్” చిత్రాన్ని దీపావళి కి తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసాము. ఈ చిత్రం భారీ వసూళ్లతో , చక్కటి ప్రేక్షకాదరణ తో ప్రదర్శింపబడుతోంది. ఈ శుభసందర్భం లో మా బ్యానర్ లో మరొక కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు సంతోషం గా ఉంది. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌ గారు మా బ్యానర్ కు “118” చిత్రం తో అద్భుతమైన విజయాన్ని అందించారు. ఇప్పుడు మళ్ళీ మా బ్యానర్ లో ఒక చిత్రాన్ని చేయబోతున్నారు. ఒక కొత్త తరహా కథ తో రూపొందబోతున్న ఈ చిత్రం వివరాలను త్వరలోనే తెలియజేస్తాం”, అని అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − ten =