గతంలో ఒకే బంగారం సినిమా టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ మహానటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. మహానటిలో జెమిని గణేశన్ పాత్రని తనదైన శైలిలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరోసారి తెలుగు ఆడియన్స్ ను టార్గెట్ చేయనున్నాడు. 1997 లో అజిత్..విక్రమ్ లు ప్రధాన పాత్రల్లో ‘ఉల్లాసం’ అనే సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. ఇప్పుడు 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ సినిమాను రీమేక్ చేయనున్నారు. జేడీ & జెర్రీ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విక్రమ్ పాత్రలో యువ నటుడు విక్రమ్ ప్రభు.. అజిత్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తారట. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందట. అయితే ఈ జెనరేషన్ ఆడియన్స్ కు తగ్గట్టు మార్పుచేర్పులు చేయనున్నారట. ఇక తమిళ్ సినిమాను రీమేక్ చేయడానికి ఒప్పుకున్న దుల్కర్ ఆ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడట మరి చూద్దాం ఈ రీమేక్ ఎలా ఉంటుందో. మరి చూద్దాం ఈ రీమేక్ ఎలా ఉంటుందో.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: